ఐపీఎల్ 14వ సీజన్‌లో లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ప్లేఆఫ్స్‌పై (ipl 2021 playoffs) పడింది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ipl 2021 playoffs teams) తమ స్థానాలను ఖరారు చేసుకోగా పది ఓటములతో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ రేసు నుంచి తప్పుకొంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఒకే ఒక్క నాలుగో స్థానం కోసం నాలుగు జట్లు పోటీపడుతున్నాయి. అందులో కోల్‌కతా నైట్‌రైడర్స్ (ipl 2021 playoffs qualified list) ఆధిక్యంలో ఉండగా తర్వాతి స్థానాల్లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ (rajasthan ipl team), ముంబయి ఇండియన్స్ ఉన్నాయి. అయితే, ఇందులో ప్రధానంగా కోల్‌కతాకే ఎక్కువ అవకాశాలున్నాయి.
అడుగు దూరంలో కోల్‌కతా..
కోల్‌కతా ఇప్పటికే ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. రన్‌రేట్ (+0.294) పరంగా చూసినా మిగతా మూడు జట్ల కన్నా మెరుగైన స్థితిలో కొనసాగుతోంది. మరోవైపు గురువారం రాజస్థాన్‌తో చివరి మ్యాచ్‌లో ఆడాల్సి ఉండగా అందులో గెలిస్తే నాలుగో స్థానంలో ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గనుక కోల్‌కతా ఓడితే తర్వాతి స్థానాల్లో ఉన్న రాజస్థాన్ లేదా ముంబయి నాలుగో స్థానం కోసం పోటీపడే వీలుంది.
రాజస్థాన్ ఓటమే.. ముంబయికి అవకాశం
డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబయి ఇండియన్స్ ఈ సీజన్‌లో కీలక మ్యాచ్‌ల్లో ఓటమిపాలై ఏడో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలే సాధించి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం పంజాబ్, రాజస్థాన్ జట్లతో సమానంగా 10 పాయింట్లతో కొనసాగుతున్నా.. రన్‌రేట్ (-0.453) పరంగా వెనుకంజలోనే కొట్టుమిట్టాడుతోంది. అయితే, రోహిత్ సేన ఇంకా హైదరాబాద్, రాజస్థాన్ జట్లతో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవడంతో పాటు.. రాజస్థాన్ చేతిలో కోల్‌కతా ఓడితే తప్పా ప్లే ఆఫ్స్ చేరే అవకాశం లేదు.