తెలంగాణ

telangana

ETV Bharat / sports

విలియమ్సన్​ను ఎందుకు ఆడించట్లేదు? - విలియమ్సన్ ఎస్​ఆర్​హెచ్

ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​లో హైదరాబాద్​ జట్టు వరుస ఓటములపై అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్టార్ బ్యాట్స్​మన్​ విలియమ్సన్​ను ఎందుకు జట్టులోకి తీసుకోవట్లేదని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ అతడికి ఏమైంది?

What happened to kane williamson
విలియమ్సన్​ను ఎందుకు ఆడించట్లేదు?

By

Published : Apr 19, 2021, 6:45 AM IST

Updated : Apr 19, 2021, 7:08 AM IST

ఈసారి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. బ్యాటింగ్‌ వైఫల్యమే ఆ మూడు ఓటములకు ప్రధాన కారణం. ముఖ్యంగా మిడిలార్డర్‌ వైఫల్యం సన్‌రైజర్స్‌కు పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు అభిమానుల మనసుల్లో మెదులుతోంది ఒకటే.. ఆ జట్టు బ్యాటింగ్‌కు ఎంతో కీలకమైన కేన్‌ విలియమ్సన్‌ను ఎందుకు ఆడించట్లేదని?

స్టార్ బ్యాట్స్​మన్​ విలియమ్సన్

ముంబయి ఇండియన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో మిడిలార్డర్‌లో కేన్‌ లాంటి బ్యాట్స్‌మన్‌ లేకపోవడం సన్‌రైజర్స్‌ను గట్టి దెబ్బ కొట్టింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో అభిమానులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అయితే కేన్‌కు మ్యాచ్‌ ఫిట్‌సెస్‌ లేదని ఆరంభం నుంచి ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంఛైజీ చెబుతూ వస్తోంది. ముంబయితో మ్యాచ్‌ తర్వాత కూడా కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌, మళ్లీ ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. విలియమ్సన్‌ ఫిట్‌నెస్‌ విషయంపై ఫిజియోతో మాట్లాడాలని.. కేన్‌కు ఇబ్బంది లేకపోతే తర్వాత మ్యాచ్‌లో అవకాశం ఇస్తామని.. అతడిది జట్టులో కీలకపాత్ర అని వార్నర్‌ పేర్కొన్నాడు. అయితే తొలి రెండు మ్యాచ్‌లను పక్కనపెట్టాక కూడా ఇంకా అతడు ఫిట్‌నెస్‌ సాధించలేదా.. ముంబయితో కీలకమైన పోరులోనైనా ఆడించాల్సింది అని అభిమానులు అంటున్నారు. ముంబయితో మ్యాచ్‌లో పెద్దగా అనుభవం లేని ముగ్గురు భారత కుర్రాళ్లకు (సమద్‌, విరాట్‌, అభిషేక్‌) తుది జట్టులో చోటివ్వడంపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి కూర్పుతో సన్‌రైజర్స్‌ ఎలా గెలవగలదని మాజీ ఆటగాడు సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు.

ఇది చదవండి:'విలియమ్సన్​కు ఇంకా సమయం పడుతుంది'

Last Updated : Apr 19, 2021, 7:08 AM IST

ABOUT THE AUTHOR

...view details