ఐపీఎల్లో ఇద్దరు ఆటగాళ్లు కొవిడ్ బారిన పడ్డారు. భాగంగా నేడు జరగాల్సిన కోల్‌కతా-బెంగళూరు మ్యాచ్ వాయిదా పడింది. లీగ్‌లో ఆడుతున్న సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తిలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
"లీగ్‌లో భాగంగా ఈ రోజు కోల్‌కతా-బెంగళూరు మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ, ఆటగాళ్లలో ఇద్దరికీ పాజిటివ్‌గా తేలింది. కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్లకు కరోనా నిర్ధరణ అయింది. దీనిపై బెంగళూరు ఫ్రాంఛైజీ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ఈ రోజు జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
"ఇప్పటివరకు కోల్‌కతా ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ వరుణ్ చక్రవర్తి భాగమయ్యాడు. 7 వికెట్లు తీశాడు. ఇప్పుడు దిల్లీ ఆటగాళ్లను కూడా పరీక్షించాల్సి ఉంటుంది. సందీప్, వరుణ్ ఎవరెవరిని కలిశారో యాప్ వాచ్ ద్వారా తెలుసుకోవచ్చు. గతంలో దిల్లీ ఆటగాడు నోర్ట్జెకు కూడా ఇలాగే ముందు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. రెండోసారి చేసిన పరీక్షల్లో మళ్లీ నెగెటివ్‌గా వచ్చింది. అందుకే వీరిద్దరికీ రెండోసారి ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేశాం. నివేదిక రావడానికి సమయం పడుతుంది. అందుకే నేటి మ్యాచ్ వాయిదా వేస్తున్నాం" అని సదరు అధికారి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'వాళ్లు ఇంకా ఐపీఎల్లో ఆడటం ఆశ్చర్యంగా ఉంది'