తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఉత్కంఠ పోరులో పంజాబ్​ విజయం - ఎస్​ఆర్​హెచ్x పీబీకేఎస్

ఐపీఎల్​ 2021లో సన్​రైజర్స్​పై పంజాబ్​ కింగ్స్​ విజయం సాధించింది. 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్  ఏడు వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.

SRH vs PBKS
పంజాబ్ కింగ్, సన్ రైజర్స్ హైదరాబాద్

By

Published : Sep 25, 2021, 11:07 PM IST

Updated : Sep 25, 2021, 11:22 PM IST

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఆటతీరు మారలేదు. తొలుత బంతితో కట్టడి చేసినా బ్యాటింగ్‌లో మాత్రం చేతులెత్తేసింది. 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఏడు వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.

బ్యాట్స్‌మెన్‌లో జేసన్‌ హోల్డర్‌(47; 29 బంతుల్లో 5×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. చివరి బంతికి 7 పరుగులు అవసరం కాగా కేవలం ఒక పరుగు మాత్రమే వచ్చింది. దీంతో హైదరాబాద్‌ 5 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Last Updated : Sep 25, 2021, 11:22 PM IST

ABOUT THE AUTHOR

...view details