తెలంగాణ

telangana

By

Published : Apr 13, 2021, 12:43 PM IST

ETV Bharat / sports

'మాస్టర్'​ పాటకు దిల్లీ క్రికెటర్ల చిందులు.. వీడియో వైరల్​

దిల్లీ ఆటగాళ్లు ప్రముఖ తమిళ పాటకు డ్యాన్స్​లేస్తూ ఉల్లాసంగా గడిపారు. క్రిస్​ వోక్స్, అశ్విన్​, స్టీవ్​ స్మిత్​, రహానె, ధావన్, పంత్​ చిందులేస్తూ ఉన్న వీడియోను దిల్లీ క్యాపిటల్స్​ తమ అధికారిక ట్విట్టర్​లో షేర్​ చేసింది. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

IPL 2021: Steve Smith and his DC teammates dance to a popular Tamil song
'మాస్టర్'​ పాటకు దిల్లీ క్రికెటర్ల చిందులు.. వీడియో వైరల్​

బయో బబుల్​లో ఉంటూ ఐపీఎల్​ ఆడుతున్న క్రికెటర్లు.. అప్పుడప్పుడు డ్యాన్స్​లు చేస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా తమిళ హీరో విజయ్​ నటించిన 'మాస్టర్'​ సినిమాలోని 'వాతి కమింగ్​' పాటకు దేశ, విదేశీ ఆటగాళ్లు చిందులేస్తున్నారు. దిల్లీ క్యాపిటల్స్​ ఆటగాళ్లు కూడా ఇప్పుడు ఈ సాంగ్​కు స్టెప్పులేశారు. ఈ వీడియోను డీసీ తమ అధికారిక ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేసింది. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ముందుగా క్రిస్​ వోక్స్​ వాతి కమింగ్​ పాటకు చిందులేయగా.. ఆ తర్వాత అశ్విన్​, స్టీవ్​ స్మిత్​, అజింక్య రహానె, శిఖర్​ ధావన్​, రిషభ్​ పంత్​ ఒక్కొక్కరుగా వారి వారి తరహాలో స్టెప్పులేశారు. తర్వాత అందరూ కలిసి డ్యాన్స్​లేశారు.

గత సీజన్​లో దిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జే వంటి కీలక ఆటగాళ్లు​ దూరమైనప్పటికీ దిల్లీ ఈసారి తమ తొలి మ్యాచ్​లో గెలుపొందింది. చెన్నై జట్టుపై 189 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.

ఇదీ చదవండి:'వాతి కమింగ్'​కు చిందులేసిన సన్​రైజర్స్​ ఆటగాళ్లు

ఇదీ చదవండి:తెవాతియా అద్భుత క్యాచ్​.. పరాగ్​ చిత్రమైన బంతి

స్మిత్​ ఇంత తక్కువకెలా?

స్టీవ్​ స్మిత్​ను కేవలం రూ.2.2 కోట్లకు దక్కించుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు దిల్లీ కోచ్ రికీ పాంటింగ్. "ఇంత తక్కువ మొత్తానికి ఎలా దక్కించుకున్నామో అర్థం కావట్లేదు. గతేడాది రాజస్థాన్​కు ఆడిన స్మిత్​ను ఈ ఏడాది ఆ ఫ్రాంఛైజీ వదిలేసింది. ఇలా చాలా మందిని చాలా జట్లు వదిలేశాయి. అయినా వారు గత ధర కంటే కాస్త అటుఇటుగా మినీ వేలంలో అమ్ముడయ్యారు. చాలా ఫ్రాంఛైజీల దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ, స్మిత్​ కోసం ఎవరూ పోటీపడలేదు. ఇది ఆశ్చర్యంగా అనిపించింది" అని పాంటింగ్ తెలిపాడు.

ఇప్పటికే హెట్​మయర్, స్టాయినిస్​, క్రిస్ వోక్స్, టామ్​ కరన్​​.. నలుగురు విదేశీ ప్లేయర్లు తుది జట్టులో ఉన్నారు. దీంతో టీమ్​లో స్థానం కోసం స్మిత్​ ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ అతడు బరిలోకి దిగితే కనుక టాప్​-3లో బ్యాటింగ్​కు వస్తాడని పాంటింగ్ స్పష్టం చేశాడు. దిల్లీ తమ తదుపరి మ్యాచ్​ ఏప్రిల్​ 15న రాజస్థాన్​ రాయల్స్​తో ఆడనుంది.

ఇదీ చదవండి:నమ్మకం కోల్పోలేదు.. మ్యాచ్​పై మాటల్లేవ్‌..

ఇదీ చదవండి:'వాతి కమింగ్'కు పంచెకట్టులో రైనా చిందులు

ABOUT THE AUTHOR

...view details