తెలంగాణ

telangana

ETV Bharat / sports

Srikar Bharat RCB: తెలుగు క్రికెటర్​పై మ్యాక్స్​వెల్​ ప్రశంసలు - శ్రీకర్​ భరత్​

యువ బ్యాట్స్​మన్​ శ్రీకర్​ భరత్​పై(Srikar Bharat RCB) ప్రశంసలు కురిపించాడు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఆల్​రౌండర్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​(Glenn Maxwell News). రాజస్థాన్​ రాయల్స్​తో(RCB Vs RR) జరిగిన మ్యాచ్​లో భరత్​ అద్భుతంగా రాణించాడని అన్నాడు. భరత్​ ఒక టాప్​ క్లాస్​ బ్యాట్స్​మన్​ అని మ్యాక్సీ కితాబిచ్చాడు.

IPL 2021: Srikar Bharat is genuine top-class batter, says Maxwell
Srikar Bharat RCB: 'జట్టులో అతనొక టాప్​ క్లాస్​ బ్యాట్స్​మన్​'

By

Published : Sep 30, 2021, 9:39 AM IST

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టులో చేరిన తర్వాత తన ఆటతీరులో మార్పు వచ్చిందని అంటున్నాడు ఆ జట్టు ఆల్​రౌండర్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​(Glenn Maxwell News). ఐపీఎల్​లోని(IPL 2021) ఇతర ఫ్రాంఛైజీలతో పోలిస్తే ఆర్సీబీ శిబిరం చాలా భిన్నంగా ఉందని తెలిపాడు. యువ ఆటగాళ్ల ప్రోత్సహించే విధమైన వాతావరణం ఆర్సీబీలో ఉందని అభిప్రాయపడ్డాడు. జట్టులోని యువ బ్యాట్స్​మన్​ శ్రీకర్​ భరత్​పై(Srikar Bharat RCB) ప్రశంసలు కురిపించాడు.

"ఈ మ్యాచ్​లో మేము చాలా బాగా ఆడాము. బౌలింగ్​లోని చివరి పది ఓవర్లలో ప్రత్యర్థులను కట్టడి చేయగలిగాం. ఆ తర్వాత బ్యాటింగ్​లోనూ అదే జోరు కొనసాగించి మ్యాచ్​ను ముగించాం. అదే విధంగా ఆర్సీబీ జట్టులో చేరిన తర్వాత నా ఆటతీరు పూర్తిగా మారిపోయింది. ఇతర ఫ్రాంఛైజీలతో పోలిస్తే ఇక్కడ కొంచెం భిన్నంగా ఉంది. జట్టులోని యువ ఆటగాళ్లందరూ ఒకరిపై ఆధారపడకుండా సొంతంగా రాణించడం సంతోషకరమైన విషయం. రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో యువ బ్యాట్స్​మన్​(కేఎస్​ భరత్​) అద్భుతంగా రాణించాడు. అతడొక టాప్​ క్లాస్​ బ్యాటర్".

- గ్లెన్​ మ్యాక్స్​వెల్​, ఆర్సీబీ ఆల్​రౌండర్​

ఐపీఎల్​లో బుధవారం జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్​ జట్టుపై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆల్‌రౌండ్‌ జోరుతో(RCB Vs RR) అదరగొట్టింది. మ్యాక్స్‌వెల్‌ (50 నాటౌట్‌), వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ శ్రీకర్‌ భరత్‌ (44) మెరవడం వల్ల 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసింది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడం వల్ల మొదట రాజస్థాన్‌ 9 వికెట్లకు 149 పరుగులే చేయగలిగింది. లూయిస్‌ (58) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఓ దశలో మంచి స్కోరు చేసేలా కనిపించిన రాజస్థాన్‌కు చాహల్‌ (2/18), షాబాజ్‌ అహ్మద్‌ (2/10), హర్షల్‌ పటేల్‌ (3/34) కళ్లెం వేశారు. భరత్‌, మ్యాక్స్‌వెల్‌ల జోరుతో లక్ష్యాన్ని బెంగళూరు 17.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

ఐపీఎల్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు ఆదివారం జరగనున్న మ్యాచ్​లో(RCB Next Match) పంజాబ్​ కింగ్స్​తో తలపడనుంది. ​

ఇదీ చూడండి..RCB Vs RR: కోహ్లీసేనకు ప్లేఆఫ్​ ఆశలు పదిలం!

ABOUT THE AUTHOR

...view details