టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ తనయుడు అర్జున్ తెందూల్కర్(arjun tendulkar ipl) ఐపీఎల్ 2021(IPL 2021 News)arjuకు దూరమయ్యాడు. గాయం కారణంగా ఇతడి స్థానంలో మరో ఆటగాడికి తీసుకుంది ముంబయి ఇండియన్స్(Mumbai Indians team 2021). దీంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే అతడు లీగ్ నుంచి వైదొలిగాడు.
ఈ ఏడాది వేలంలో కనీస ధర రూ.20 లక్షలకు అర్జున్ను దక్కించుకుంది ముంబయి ఇండియన్స్. దీంతో ఇతడికి ఒక్క మ్యాచ్‌లో అయినా ఆడే అవకాశం వస్తుందని అంతా భావించారు. ముంబయి ప్లే ఆఫ్స్ రేసులో ముందుంటే యువ ఆటగాళ్లకు అవకాశం వచ్చేది. ఆ సమయంలో అర్జున్ను కూడా ఓ మ్యాచ్ ఆడించే వీలుండేది. కానీ ముంబయి వరుస ఓటములతో ప్లే ఆఫ్స్ రేసులో వెనకపడటం వల్ల అర్జున్‌కు నిరాశ తప్పలేదు.