ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్ వేదికగా ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్ నిర్వహణ విషయంలో ఐపీఎల్ విధానాన్ని ఐసీసీ ఆదర్శంగా తీసుకోనుంది. ఐపీఎల్ ప్రస్తుత సీజన్ కోసం ఆరు వేదికలను ప్రకటించినప్పటికీ.. ఒకే దశలో రెండు నగరాల్లో మాత్రమే మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. పొట్టి ప్రపంచకప్ నిర్వహణలోనూ ఇదే విధానాన్ని అనుసరించే వీలుందని ఐసీసీ బయో రక్షణ విభాగాధిపతి డేవ్ మస్కర్ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ ఆదర్శంగా టీ20 ప్రపంచకప్ నిర్వహణ! - ఐపీఎల్ టీ20 ప్రపంచకప్
భారత్ వేదికగా అక్టోబర్‌లో నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్ నిర్వహణలో ఐపీఎల్ విధానాన్ని అంతర్జాతీయ క్రికెట్ కమిటీ(ఐసీసీ) ఆదర్శంగా తీసుకోనుంది. ఒకే దశలో రెండు నగరాల్లో బయోబబుల్‌ను ఏర్పాటు చేసి మ్యాచ్‌లు నిర్వహించాలని ఐసీసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ విధానాన్ని పరిశీలించేందుకు సోమవారం ఐసీసీ బృందం భారత్ రానుంది.
ఐపీఎల్ ఆదర్శంగా టీ20 ప్రపంచకప్ నిర్వహణ!
ఆ టోర్నీ నిర్వహణ గురించి చర్చించడం సహా ఏర్పాట్లను పరిశీలించేందుకు ఐసీసీ బృందం సోమవారం భారత్‌కు రానుంది. 16 జట్లు తలపడే ప్రపంచకప్ కోసం హైదరాబాద్ సహా 9 వేదికలతో బీసీసీఐ జాబితా రూపొందించారు. జూన్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహిస్తామని మస్కర్ అన్నాడు.
ఇదీ చూడండి..కింగ్ కోహ్లీ ఖాతాలో సరికొత్త రికార్డు
Last Updated : Apr 23, 2021, 2:15 PM IST