తెలంగాణ

telangana

ETV Bharat / sports

బట్లర్​ సెంచరీ.. హైదరాబాద్​ లక్ష్యం 221 - ఐపీఎల్​ 14వ సీజన్​

హైదరాబాద్​కు 221 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది రాజస్థాన్. బట్లర్​(124) సెంచరీతో అదరగొట్టి, అభిమానుల మనసు దోచుకున్నాడు. దిల్లీ వేదికగా ఈ మ్యాచ్​ జరుగుతోంది.

jos buttler, sanju samson
జాస్​ బట్లర్, సంజు శాంసన్​

By

Published : May 2, 2021, 5:20 PM IST

Updated : May 2, 2021, 5:31 PM IST

సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరుగుతున్న మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​ బ్యాట్స్​మెన్​ అదరగొట్టారు. బట్లర్​(124) సెంచరీ ఆకట్టుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల​ నష్టానికి 221 పరుగులు చేశారు. హైదరాబాద్​ బౌలర్లలో సందీప్​ శర్మ, రషీద్​ ఖాన్​, విజయ్​ శంకర్​ తలో వికెట్​ తీశారు.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు​ దిగిన రాజస్థాన్​కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. యశస్వి జైస్వాల్​(12)ను మూడో ఓవర్లోనే రషీద్​ఖాన్ ఔట్ చేశాడు​. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్​(48) అర్ధసెంచరీకి దగ్గరగా వచ్చి ఔటయ్యాడు.మొత్తంగా రెండో వికెట్​కు ఓపెనర్ బట్లర్​తో కలిసి కలిసి 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 124 పరుగులు చేసిన బట్లర్​ దూకూడుకు 19 ఓవర్​లో కళ్లెం వేశాడు సందీప్​ శర్మ. దీంతో అతడు మూడో వికెట్​గా పెవిలియన్​ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రియాన్​ పరాగ్(15*)​, డేవిడ్​ మిల్లర్(7*)​ తమ వంతుగా ఆడారు.

Last Updated : May 2, 2021, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details