దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్‌లో తడబడింది. రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మంచి ఆరంభం లభించినా.. వరుస వికెట్లు పడటం వల్ల తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి మెప్పించారు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబయికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డికాక్ (1) తొందరగానే పెవిలియన్ చేరాడు. తర్వాత సూర్యకుమార్‌తో కలిసి రోహిత్ దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 58 పరుగులు జోడించారు. ఫలితంగా తొలి పవర్‌ప్లేలో 55 పరుగులు సాధించి పటిష్ఠ స్థితిలో కనిపించింది ముంబయి. కానీ ఆ సంతోషం ఏమాత్రం నిలవలేదు.