చెన్నైతో ఆదివారం మ్యాచ్‌లో ముంబయి(CSK Vs MI 2021) ఓడిపోయింది. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో(IPL 2021) కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అందుబాటులో లేరు. అయితే తర్వాతి మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులోకి వస్తాడని ఆ జట్టు కోచ్ మహేలా జయవర్ధనే స్పష్టం చేశాడు.
"యూకే నుంచి తిరిగి వచ్చిన తర్వాత రోహిత్ శర్మ సాధన చేస్తూనే ఉన్నాడు. అయినా అతడికి కొన్ని రోజులు విశ్రాంతిని ఇస్తే బాగుంటుందని భావించాం. తర్వాతి మ్యాచ్‌లో రోహిత్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్య ప్రస్తుతం ప్రాక్టీసులో ఉన్నాడు. కాబట్టి అతడికి మరికొన్నాళ్లు విశ్రాంతినివ్వాలని అనుకుంటున్నాం"
- మహేలా జయవర్ధనే, ముంబయి ఇండియన్స్ కోచ్
ఐపీఎల్-14(IPL 2021) రెండో అంచెలో చెన్నై(CSK vs MI) శుభారంభం చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (88 నాటౌట్; 58 బంతుల్లో 9×4, 4×6) మెరవడం వల్ల(Ruturaj Gaikwad IPL Innings) ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను ఓడించింది. జడేజా(26), డ్వేన్ బ్రావో (23) సహకారంతో రుతురాజ్ పోరాడడం వల్ల మొదట చెన్నై 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. ఛేదనలో ముంబయి 8 వికెట్లకు 136 పరుగులే చేయగలిగింది. బ్రావో (3/25), దీపక్ చాహర్ (2/19) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆ జట్టుకు కళ్లెం వేశారు. సౌరభ్ తివారి(50 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది.
ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ జట్టు తమ తర్వాతి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో(MI Vs KKR 2021) గురువారం ఆడనుంది.
ఇదీ చూడండి..IPL 2021: కోల్‌కతాతో ఆర్సీబీ పోరు.. ట్రోఫీ రేసులో నిలిచేనా?