హైదరాబాద్-బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మరోసారి బౌలర్లు రాణించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. మాక్స్‌వెల్ (59) ఒక్కడే రాణించాడు.
కోహ్లీ, మ్యాక్స్‌వెల్ పోరాటం.. హైదరాబాద్ లక్ష్యం 150 - క్రికెట్ న్యూస్
హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులే చేసింది. మ్యాక్స్‌వెల్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.
టాస్ గెలిచిన వార్నర్ సేన బెంగళూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 19 పరుగుల స్కోరు వద్ద పడిక్కల్‌ను(11) భువనేశ్వర్ ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాబాజ్, కోహ్లీ కలిసి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షాబాజ్‌ను నదీమ్ పెవిలియన్‌కు పంపించాడు. అనంతరం భారం మొత్తం మ్యాక్స్‌వెల్, కోహ్లీపై పడింది. 91 పరుగుల వద్ద కోహ్లీని(33) హోల్డర్ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన ఫస్ట్ మ్యాచ్ హీరో డివిలియర్స్ 1(5) ఈసారి నిరాశపరిచాడు. సుందర్ 8(11), క్రిస్టియన్ 1(2), జెమీసన్ 12(9) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఆఖర్లో మ్యాక్స్‌వెల్ మెరుపులు మెరిపించడం వల్ల బెంగళూరు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ 3, రషీద్‌ఖాన్ 2 వికెట్లు తీయగా.. భువనేశ్వర్, నదీమ్, నటరాజన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.