మ్యాక్స్‌వెల్(Maxwell IPL News) ఆల్‌రౌండ్ సత్తా చాటడం వల్ల ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 54 పరుగుల తేడాతో ముంబయిని(RCB Vs MI) చిత్తు చేసింది. మ్యాక్స్‌వెల్(56), కోహ్లీ (51) మెరవడం వల్ల మొదట బెంగళూరు 6 వికెట్లకు 165 పరుగులు సాధించింది. హర్షల్ పటేల్ (4/17), మ్యాక్స్‌వెల్ (2/23), చాహల్ (3/11) విజృంభించడం వల్ల ఛేదనలో ముంబయి 18.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ (43) ఒక్కడే రాణించాడు. హర్షల్ పటేల్ హ్యాట్రిక్(Harshal Patel Hat Trick) సాధించడం విశేషం. బెంగళూరు ఆరో విజయంతో ప్లేఆఫ్స్(IPL Playoffs 2021) అవకాశాలను ఇంకా మెరుగుపర్చుకుంది.
ముంబయి విలవిల..
రోహిత్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఛేదనను ముంబయి ఘనంగానే ఆరంభించింది. డికాక్ (24) వికెట్‌ను కోల్పోయి 9 ఓవర్లలో 75/1తో సాఫీగా లక్ష్యం దిశగా సాగింది. కానీ పదో ఓవర్లో మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రోహిత్ ఔట్ కావడం వల్ల మ్యాచ్ మలుపు తిరిగింది. అక్కడి నుంచి ముంబయి ఇన్నింగ్స్ గతి తప్పింది. బెంగళూరు కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఇషాన్ కిషన్(9), కృనాల్(5), సూర్యకుమార్ యాదవ్(8) చకచకా పెవిలియన్ చేరడం వల్ల ముంబయి 15 ఓవర్లలో 99/5తో ఒత్తిడిలో పడింది.
చివరి అయిదు ఓవర్లలో ముంబయి 67 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అయినా పొలార్డ్, హార్దిక్ క్రీజులోనే ఉండగా.. ముంబయిలో ఆశలు మిగిలే ఉన్నాయి. కానీ చాలా వేగంగా ఆ ఆశలకు తెరపడింది. 17వ ఓవర్లో హర్షల్ వరుస బంతుల్లో హార్దిక్(3), పొలార్డ్(7), రాహుల్ చాహర్(0)ను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించడం ద్వారా బెంగళూరుకు విజయాన్ని ఖాయం చేశాడు.
మెరిసిన మ్యాక్స్‌వెల్, కోహ్లీ
మొదట బెంగళూరు అనుకున్నదానికంటే తక్కువ స్కోరే చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు.. రెండో ఓవర్లోనే పడిక్కల్(0)ను కోల్పోయినా కోహ్లీ నిలబడడం వల్ల గట్టి పునాదినే వేసుకుంది. చక్కని షాట్లు ఆడిన కెప్టెన్ కోహ్లీ.. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన శ్రీకర్ భరత్(32)తో కలిసి రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించాడు. 9వ ఓవర్లో భరత్ ఔటయ్యేటప్పటికి జట్టు స్కోరు 75. ఆ తర్వాత కోహ్లీ ధాటిగా ఆడకున్నా మ్యాక్స్‌వెల్ దూకుడు ప్రదర్శించాడు.
స్విచ్ హిట్లతో రెండు కళ్లు చెదిరే సిక్స్‌లు కొట్టాడు 16వ ఓవర్లో కోహ్లీ నిష్క్రమించేటప్పటికి స్కోరు 126. డివిలియర్స్(11), మ్యాక్స్‌వెల్ బ్యాట్ ఝుళిపించడం వల్ల తర్వాతి రెండు ఓవర్లలో 30 పరుగులు రాబట్టిన బెంగళూరు 156/3తో మంచి స్కోరే చేసేలా కనిపించింది. కానీ చివరి రెండు ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రా, బౌల్ట్.. కేవలం 9 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి బెంగళూరు భారీ స్కోరు ఆశలపై నీళ్లు చల్లారు.
తొలి బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ