ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఆచితూచి ఆడింది. బెంగళూరు బౌలర్లను ధాటిగా ఎదుర్కొని, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేశారు. క్రిస్ లిన్ అత్యధికంగా 49 పరుగులు చేశాడు.
ఐపీఎల్: ముంబయి ఆచితూచి.. ఆర్సీబీ లక్ష్యం 160 - ఐపీఎల్ న్యూస్
ప్రస్తుత ఐపీఎల్లో చెన్నై వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో ముంబయి, బెంగళూరుకు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మరి కోహ్లీసేన ఏం చేస్తుందో చూడాలి.
టాస్ గెలిచి ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకోవడం వల్ల ముంబయి తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ రోహిత్ 19 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. రెండో వికెట్‌కు లిన్-సూర్యకుమార్ కలిసి 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం 31 పరుగుల చేసిన సూర్య.. జెమీసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఆ తర్వాత లిన్ 49, హార్దిక్ పాండ్య 13, ఇషాన్ కిషన్ 28, పొలార్డ్ 7, కృనాల్ 7, పరుగులు చేసి పెవిలియన్‌కు చేరారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 5 వికెట్లతో అదరగొట్టగా, జెమీసన్, సుందర్ తలో వికెట్ తీశారు.