తెలంగాణ

telangana

ETV Bharat / sports

హైదరాబాద్​తో ఆర్సీబీ ఢీ.. గెలుపు ఎవరిదో?

చెన్నై వేదికగా సన్​రైజర్స్ హైదరాబాద్​తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. సాయంత్రం 7:30 గంటలకు జరిగే ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో మరి?

RCB look to consolidate position as SRH eye first win
హైదరాబాద్​తో ఆర్సీబీ ఢీ.. గెలుపు ఎవరిదో?

By

Published : Apr 14, 2021, 5:30 AM IST

ఐపీఎల్​లో తొలి మ్యాచ్ గెలిచి ఊపు మీదున్న బెంగళూరు.. రెండో మ్యాచ్​లోనూ ఆ జోరు చూపించేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్​తో చెన్నై వేదికగా బుధవారం తలపడనుంది. సాయంత్రం 7:30 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది.

గత మ్యాచ్​లో బ్యాటింగ్​, బౌలింగ్​లో సమష్టి కృషితో ఆర్సీబీ విజయం దక్కించుకుంది. తొలిమ్యాచ్​లో ఆడలేకపోయిన ఓపెనర్ దేవ్​దత్ పడిక్కల్.. ఈసారి తుదిజట్టులో ఉండే అవకాశముంది. కోహ్లీ, డివిలియర్స్, మ్యాక్స్​వెల్​ ఫామ్​లో ఉండటం బెంగళూరుకు కలిసొచ్చే అంశం. బౌలర్లలో హర్షల్ పటేల్​తో పాటు మిగతా వారు తమ వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రాక్టీసులో ఆర్సీబీ ఆటగాళ్లు

మరోవైపు కోల్​కతాతో తొలిమ్యాచ్​ ఓటమి నుంచి బయటపడి సక్సెస్​ ట్రాక్ ఎక్కాలని సన్​రైజర్స్ భావిస్తోంది. అందుకోసం కొత్త ప్రణాళికలతో బెంగళూరుతో మ్యాచ్​కు సిద్ధమవుతోంది. తొలిపోరులో లోపాల్ని అధిగమించి ఇందులో రాణించాలని చూస్తోంది.

ప్రాక్టీసులో హైదరాబాద్ బ్యాట్స్​మన్ బెయిర్​స్టో

జట్లు(అంచనా)

హైదరాబాద్:వార్నర్(కెప్టెన్), బెయిర్​స్టో, సాహా, మనీష్ పాండే, మహమ్మద్ నబీ, విజయ్ శంకర్, అబ్దుల్ సమాద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, సందీప్ శర్మ.

బెంగళూరు:విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రజత్‌ పాటిదార్‌, ఏబీ డివిలియర్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్, డేనియెల్‌ క్రిస్టియన్, వాషింగ్టన్‌ సుందర్‌, కైల్‌ జేమీసన్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, షాబాజ్‌ అహ్మద్‌, యుజ్వేంద్ర చాహల్‌.

ABOUT THE AUTHOR

...view details