ఐపీఎల్ 14వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయపరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో దూసుకుపోతోంది. ముంబయి వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేన పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 178 పరుగుల భారీ లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఛేదించింది.
పడిక్కల్ సెంచరీ.. రాజస్థాన్‌ను చితక్కొట్టిన ఆర్సీబీ - రాజస్థాన్ రాయల్స్ స్క్వాడ్ టుడే
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. పడిక్కల్ (101) సెంచరీతో అదరగొట్టగా.. కోహ్లీ (72) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
ఆర్సీబీ
ఓపెనర్లుగా వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్(101నాటౌట్; 52 బంతుల్లో 11x4, 6x6), కెప్టెన్ విరాట్ కోహ్లీ(72 నాటౌట్; 47 బంతుల్లో 6x4, 3x6) ధాటిగా ఆడారు. ఓవర్‌కు పది పరుగులకు పైగా స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. దాంతో 16.3 ఓవర్లలోనే బెంగళూరును విజయ తీరాలకు చేర్చారు.
Last Updated : Apr 22, 2021, 11:03 PM IST