చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా.. మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో శనివారం ముంబయితో తన 200 మ్యాచ్ ఆడాడు రైనా. ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్‌గా.. రెండో సీఎస్కే ఆటగాడిగా ఘనత సాధించాడు.
ముంబయితో మ్యాచ్‌కు ముందు 5,489 పరుగులు చేసిన రైనా.. లీగ్ చరిత్రలో అత్యధిక రన్స్ సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు. అతడి కంటే ముందు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్.. ఇప్పటికే 200 మ్యాచ్‌లాడారు. ఇక బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. 199 మ్యాచ్‌లాడాడు. సోమవారం కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో విరాట్ కూడా ఈ జాబితాలో చేరనున్నాడు.