తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2021: టాస్​ గెలిచిన పంజాబ్..రాజస్థాన్ బ్యాటింగ్​ - rajasthan royals vs punjab kings 2021

ఐపీఎల్(ipl 2021 news)​లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. నేడు (సెప్టెంబర్ 21) రాజస్థాన్ రాయల్స్​తో పంజాబ్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ముందుగా ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకుంది పంజాబ్ కింగ్స్​.

ipl
ఐపీఎల్​

By

Published : Sep 21, 2021, 7:02 PM IST

Updated : Sep 21, 2021, 7:10 PM IST

ఐపీఎల్(ipl 2021 news)​ రెండో విడత మ్యాచ్​లు అభిమానులకు మంచి జోష్​ను అందిస్తున్నాయి. మొదటి రోజు చెన్నై-ముంబయి(csk vs mi 2021), రెండో రోజు కోల్​కతా-బెంగళూరు(kkr vs rcb 2021) మధ్య జరిగిన మ్యాచ్​లు మంచి వినోదాన్ని పంచాయి.

ఈ క్రమంలోనే నేడు (సెప్టెంబర్ 21) రాజస్థాన్ రాయల్స్​తో పంజాబ్ కింగ్స్(rr vs pk live) అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఈ సీజన్​ను విజయాలతో ప్రారంభించి డీలాపడిన పంజాబ్​ ఈ మ్యాచ్​లోనైనా గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. అలాగే రాజస్థాన్ కూడా విజయం కోసం శ్రమిస్తోంది. ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇషాన్​ పొరెల్​, అదిల్​ రషీద్​, మర్క్​రమ్ పంజాబ్​ తరఫున​ ఐపీఎల్​ అరంగేట్రం చేయనున్నారు. అలాగే రాజస్థాన్​.. విధ్వంసకర బ్యాట్స్​మెన్​ ఎవిన్ లూయిన్​కు చోటిచ్చింది.

జట్లు

పంజాబ్ కింగ్స్

రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, మర్క్​రమ్, దీపక్ హుడా, ఫాబియాన్ అలెన్, ఇషాన్ పోరెల్, హర్​ప్రీత్ బ్రర్, షమీ, అదిల్ రషీద్, అర్షదీప్ సింగ్

రాజస్థాన్ రాయల్స్

ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, శాంసన్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, లివింగ్​స్టోన్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, కార్తీక్ త్యాగి, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మన్

ఇదీ చూడండి: IPL2021 News: రాజస్థాన్-పంజాబ్ పోరు.. గెలిచేదెవరు?

Last Updated : Sep 21, 2021, 7:10 PM IST

ABOUT THE AUTHOR

...view details