చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్‌లో తడబడింది. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి 120 పరుగులకే కుప్పకూలింది. దీంతో 121 రన్స్ లక్ష్యం వార్నర్‌సేన ముందుంది. ఆరంభంలో మయాంక్ ఆగర్వాల్ ఆచితూచి బ్యాటింగ్ చేసినా.. ఆ తర్వాత వచ్చిన వారు స్కోరుబోర్డును పరుగులు పెట్టించడంలో విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్ కుమార్ వేసిన రెండో ఓవర్లో కెప్టెన్ కేఎల్ రాహుల్(4) ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఆచితూచి బ్యాటింగ్ చేసినా.. 22 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఆకట్టుకోలేకపోయారు. సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి ధీటుగా నిలబడిన షారుక్ ఖాన్(22).. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.