పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. బ్యాటింగ్‌లో ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టీ20 ఫార్మాట్లో 5వేల పరుగులు నమోదు చేశాడు. చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.
12వ భారత్ క్రికెటర్‌గా..
పొట్టి క్రికెట ఫార్మాట్లో ఇప్పటివరకు 156 మ్యాచ్‌లు ఆడిన కేఎల్ రాహుల్.. 5003 రన్స్ చేశాడు. అందులో 4 సెంచరీలు, 41 అర్ధశతకాలున్నాయి. ఈ ఘనతను సాధించిన 12వ భారత క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ ఘనత వహించాడు. అయితే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు.
క్రిస్ గేల్ తర్వాత అతితక్కువ సమయంలో 5 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న బ్యాట్స్‌మన్‌గా కేఎల్ రాహుల్ ఘనతకెక్కాడు. క్రిస్ గేల్.. 132 ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. కేఎల్ రాహుల్ 143వ ఇన్నింగ్స్‌లో ఈ రికార్డు నెలకొల్పాడు.