ఐపీఎల్ 2021(IPL 2021 News) పోరు రసవత్తరంగా మారుతోంది. గ్రూప్ స్టేజ్ చివరి దశకు చేరుకోవడం వల్ల ప్లే ఆఫ్స్ బెర్తు(ipl playoffs 2021) కోసం ప్రతి జట్టు శ్రమిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ టాప్-4లో నిలవడం ఖాయంగా కనిపిస్తుండగా.. మరో రెండు స్థానాల కోసం హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో ప్లే ఆఫ్ బెర్తు(ipl playoffs 2021) కోసం ఏ జట్టుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చూద్దాం.
- చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్(delhi capitals playoffs 2021) ప్లే ఆఫ్ బెర్తు సాధించాలంటే వారు ఆడబోయే నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం ఒక మ్యాచ్ గెలిచి తీరాలి.
- రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే వారు ఆడాల్సిన 5 మ్యాచ్‌ల్లో కనీసం 4 గెలవాలి.
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్-4లో స్థానం సంపాదించాలంటే ఆడబోయే 4 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి.
- ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కావాలంటే ఆడాల్సిన 4 మ్యాచ్‌ల్లో 4 కచ్చితంగా గెలిచి తీరాలి.
- సన్‌రైజర్స్ హైదరాబాద్ మిగిలిన 5 మ్యాచ్‌ల్లో గెలిచినా ఫలితం ఉండదు.