తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2021 News: మెరిసిన లూయిస్.. ఆర్సీబీ లక్ష్యం 150 - రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు ప్రివ్యూ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు 150 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది రాజస్థాన్ రాయల్స్(RR vs RCB 2021). లూయిస్ (58), జైస్వాల్ (31)ఆకట్టుకున్నారు.

IPL news
రాయల్

By

Published : Sep 29, 2021, 9:22 PM IST

ఐపీఎల్ 2021(IPL 2021 News)లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్(RR vs RCB 2021) మంచి ఆరంభం లభించినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 149 పరుగులు సాధించింది.

టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్(RR vs RCB 2021)​కు అదిరిపోయే శుభారంభం లభించింది. ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్.. ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడిగి దిగారు. లూయిస్ ఎడాపెడా బౌండరీలు బాదగా.. జైస్వాల్ అతడికి మద్దతుగా నిలిచాడు. దీంతో తొలి పవర్​ప్లేలోనే 56 పరుగులు సాధించింది రాజస్థాన్. ఇన్నింగ్స్ ఇలా జోరుగా సాగుతున్న క్రమంలో వీరి 77 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు క్రిస్టియన్. జైస్వాల్​ (3)ను బోల్తా కొట్టించాడు. కాసేపటికి అర్ధసంచరీ పూర్తి చేసుకున్న లూయిస్​ (58)ను పెవిలియన్ చేర్చాడు గార్టన్.

తర్వాత వచ్చిన శాంసన్ (19), మహిపాల్ (3), తెవాటియా (2), లివింగ్​స్టోన్ (6) ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. చివర్లో మోరిస్ (14) కాసేపు పోరాడినా ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల పరుగులు రావడం కష్టమైంది. దీంతో చివరికి 9 వికెట్ల నష్టానికి 149 పరుగులతో సరిపెట్టుకుంది రాజస్థాన్.

ABOUT THE AUTHOR

...view details