తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2021: ఫైనల్ బెర్త్ లక్ష్యంగా కోల్​కతా-దిల్లీ ఢీ.. ఇవి తెలుసుకోండి! - దిల్లీ వర్సెస్ కోల్​కతా రికార్డులు

ఐపీఎల్ 2021(IPL 2021 News)లో భాగంగా నేడు (అక్టోబర్ 13) క్వాలిఫయర్-2 మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​తో తలపడనుంది కోల్​కతా నైట్​రైడర్స్(kkr vs dc 2021). ఈ మ్యాచ్​లో గెలిచి ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ జరగబోయే పిచ్ పరిస్థితి, రికార్డులు తదితర విషయాల గురించి తెలుసుకుందాం.

IPL 2021
ఐపీఎల్

By

Published : Oct 13, 2021, 3:29 PM IST

ఐపీఎల్(IPL 2021 News) రెండో క్వాలిఫయర్‌(ipl qualifier 2)లో దిల్లీ క్యాపిటల్స్​తో తలపడేందుకు కోల్‌కతా నైట్​రైడర్స్(kkr vs dc 2021) సిద్ధమైంది. సోమవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా..అద్భుత ప్రదర్శన చేసింది. రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు(rcb vs kkr 2021)పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక నేడు (అక్టోబర్ 13) దిల్లీపైనా గెలిచి ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవాలని చూస్తోంది. దిల్లీ కూడా ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. షార్జా వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకానుంది.

పిచ్​ పరిస్థితి

షార్జా పిచ్ తొలి పవర్​ప్లేలో​ బ్యాటింగ్​కు అనుకూలిస్తుంది. బంతి మెరుపు తగ్గినా కొద్ది బ్యాటర్లకు పరుగులు సాధించడం కష్టమే. ఈ మైదానంలో జరిగిన 9 మ్యాచ్​ల్లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లే 6 సార్లు గెలిచాయి. దీంతో టాస్ గెలిచిన జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

హెడ్ టూ హెడ్

ఈ రెండు జట్లు(kkr vs dc head to head 2021) ఇప్పటివరకు తలపడిన పోరులో 12 దిల్లీ గెలవగా, 15 మ్యాచ్​ల్లో కోల్​కతా విజయం సాధించింది. చివరిసారిగా ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్​లో కేకేఆర్ 6 సిక్సర్లు సాధించగా.. దిల్లీ ఒక్క సిక్స్ కూడా బాదలేకపోయింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. కోల్​కతా బౌలర్లు దిల్లీ బ్యాట్స్​మెన్​ను ఎంత గొప్పగా కట్టడి చేశారో.

మొత్తంగా ఇరుజట్ల రికార్డులు ఇలా ఉన్నాయి

  • భారత్​లో ఆడిన మ్యాచ్​లు - 22 (దిల్లీ 8, కేకేఆర్ 13)
  • విదేశాల్లో ఆడిన మ్యాచ్​లు - 7 (దిల్లీ 5, కేకేఆర్ 2)
  • కేకేఆర్​పై దిల్లీ సగటు పరుగులు - 153
  • దిల్లీపై కేకేఆర్ సగటు పరుగులు - 154
  • అత్యధిక పరుగులు (దిల్లీ) - 426 (శ్రేయస్ అయ్యర్)
  • అత్యధిక పరుగులు (కోల్​కతా) -272 (ఆండ్రూ రసెల్)
  • అత్యధిక వికెట్లు (దిల్లీ) - 13 (ఉమేశ్ యాదవ్)
  • అత్యధిక వికెట్లు (కోల్​కతా) - 22 (నరైన్)
  • అత్యధిక క్యాచ్​లు (దిల్లీ) - 7 (పంత్)
  • అత్యధిక క్యాచ్​లు (కోల్​కతా) - 7 (నరైన్)

రికార్డ్ అలర్ట్!

  • దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ ఈ సీజన్​లో 15 మ్యాచ్​ల్లో 413 పరుగులు చేశాడు. మొత్తంగా లీగ్​లో 83 మ్యాచ్​ల్లో 2492 రన్స్ చేశాడు. కోల్​కతాతో జరిగే మ్యాచ్​లో మరో 8 పరుగులు చేస్తే లీగ్​లో 2,500 పరుగుల క్లబ్​లో చేరతాడు.
  • ఈ సీజన్​లో ఆడిన 11 మ్యాచ్​ల్లో 15 వికెట్లు దక్కించుకున్నాడు దిల్లీ స్పిన్నర్ అక్షర్ పటేల్. మొత్తంగా లీగ్​లో ఇప్పటివరకు 95 వికెట్లు సాధించాడు. కోల్​కతాతో నేడు జరిగే ఈ మ్యాచ్​లో మరో 5 వికెట్లు తీస్తే లీగ్​లో 100 వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరతాడు.
  • కోల్​కతా కెప్టెన్ మోర్గాన్​ మరో 9 పరుగులు చేస్తే ఈ జట్టు తరఫున 1000 రన్స్ చేసిన 13వ ఆటగాడిగా నిలుస్తాడు.
  • ఐపీఎల్​లో ఇప్పటివరకు 399 బౌండరీలు బాదాడు కోల్​కతా కీపర్ దినేశ్ కార్తీక్. ఈ మ్యాచ్​లో మరో బౌండరీ సాధిస్తే 400 బౌండరీలు సాధించిన 11వ ఆటగాడిగా నిలుస్తాడు.​

తుది జట్లు (అంచనా)

దిల్లీ క్యాపిటల్స్

ధావన్, పృథ్వీ షా, పంత్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, హెట్​మెయర్, టామ్ కరన్/స్టోయినిస్, అక్షర్ పటేల్, రవి అశ్విన్, రబాడ, ఆవేశ్ ఖాన్, నోర్ట్జే

కోల్​కతా నైట్​రైడర్స్

గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రానా, మోర్గాన్ (కెప్టెన్), షకిబుల్, దినేశ్ కార్తీక్, నరైన్, శివం మావి, ఫెర్గుసన్, వరుణ్ చక్రవర్తి.

ఇవీ చూడండి: 'డివిలియర్స్​ను ఆర్సీబీ వదులుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details