తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2021 News: ప్లే ఆఫ్స్ చివరి బెర్తు ఎవరికి దక్కేనో! - ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసు

ఐపీఎల్​ 2021(IPL 2021 News)లో గ్రూప్ దశ మ్యాచ్​లు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ప్లేఆఫ్స్​ రేసు(ipl 2021 playoff teams) మరింత రసవత్తరంగా మారింది. టాప్​-4లో చోటు దక్కించుకునేందుకు నాలుగు జట్లు పోటీపడుతుండగా.. కోల్​కతా, ముంబయికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్ రేసును ఓసారి గమనిద్దాం.

IPL 2021
ఐపీఎల్​ 2021

By

Published : Oct 6, 2021, 1:19 PM IST

ఐపీఎల్ 2021(IPL 2021 News) గ్రూప్ దశ చివరి అంకానికి చేరుకుంది. దీంతో ప్లే ఆఫ్స్(ipl 2021 playoff teams) రేసులో నిలిచే జట్లేవో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆప్స్​కు వెళ్లాయి. ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం నాలుగు జట్లు పోటీపడుతుండగా.. అందులో కోల్​కతా నైట్​రైడర్స్, ముంబయి ఇండియన్స్​ ముందంజలో నిలిచాయి. ఈ నేపథ్యంలో నాలుగో స్థానం దక్కేందుకు ఏ జట్టుకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో చూద్దాం.

కోల్​కతా నైట్​రైడర్స్

టాప్-4 స్థానానికి పోటీపడుతున్న జట్లలో ఎక్కువ అవకాశాలు ఉన్నవి కోల్​కతా నైట్​రైడర్స్​కే(kolkata knight riders 2021). ఈ జట్టుతో పాటు ముంబయికి ఒకే ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఆ మ్యాచ్​ల్లో ఈ రెండు జట్లు గెలిస్తే పాయింట్ల పరంగా సమానంగా నిలుస్తాయి. కానీ ముంబయి కంటే నెట్​ రన్​రేట్ ఎక్కువగా ఉన్న కేకేఆర్​ ముందంజ వేస్తుంది. చివరి మ్యాచ్​లో కోల్​కతా రాజస్థాన్​పై గెలిచినా.. ముంబయిని సన్​రైజర్స్​ ఓడించినా కేకేఆర్​ టాప్​-4కు వెళ్లడం దాదాపు ఖాయం. ఒకవేళ రాజస్థాన్​పై కోల్​కతా ఓడి.. సన్​రైజర్స్​పై ముంబయి భారీ తేడాతో గెలిస్తే ఈ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతవుతాయి.

ముంబయి ఇండియన్స్

ప్రస్తుతం పాయింట్ల పట్టిక(ipl 2021 points table)లో ఐదో స్థానంలో ఉంది ముంబయి ఇండియన్స్(mumbai indians team 2021). ఇప్పటివరకు నెట్​రన్​రేట్ పరంగా దారుణంగా వెనకపడిన ఈ జట్టు.. రాజస్థాన్​పై భారీ విజయం సాధించి రన్​రేట్ విషయంలో పంజాబ్, రాజస్థాన్​ను దాటేసింది. ఇక దీని ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే చివరగా సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగే మ్యాచ్​లో ఈ జట్టు భారీ విజయం సాధించాలి. అలా కాకుండా రాజస్థాన్​ చేతిలో కోల్​కతా నైట్​రైడర్స్ ఓడిపోయి.. సన్​రైజర్స్​పై ముంబయి గెలిస్తే ఈ జట్టు నేరుగా టాప్​-4కు చేరుకుంటుంది.

పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్

పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ ఆశలు కూడా ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. ఒకవేళ రాజస్థాన్.. కోల్​కతాను ఓడించి, ముంబయిపై సన్​రైజర్స్, చెన్నైపై పంజాబ్ విజయం సాధిస్తే ఈ నాలుగు జట్ల మధ్య పాయింట్ల విషయంలో టై అవుతుంది. అపుడు నెట్​ రన్​రేట్ పరంగా ఉత్తమంగా ఉన్న జట్టు ముందంజ వేస్తుంది. ప్రస్తుతం రన్​రేట్ విషయంలో కోల్​కతా మెరుగ్గా ఉంది. ఆ తర్వాత ముంబయి, పంజాబ్, రాజస్థాన్ ఉన్నాయి. కావున ఇలా టై అయినా పంజాబ్, రాజస్థాన్​కు టాప్​-4కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉండవనే చెప్పాలి.

ఇవీ చూడండి: అతడి విషయంలో రిస్క్​ తీసుకున్నా: రోహిత్​

ABOUT THE AUTHOR

...view details