ఐపీఎల్ 2021లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ విభాగం విఫలమైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ శుభారంభం దక్కలేదు. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఓపెనర్లు ధావన్ (8), పృథ్వీషా (10) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు. ఆ తర్వాత కెప్టెన్ పంత్‌తో కలిసి మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల పరుగులు చేయడంలో కాస్త ఇబ్బందిపడ్డారు. పంత్ తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. ఈ క్రమంలోనే పంత్ (24)ను ముస్తాఫిజుర్ క్లీన్ బౌల్డ్ చేయగా, అయ్యర్ (43) స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.
రాణించిన రాజస్థాన్ బౌలర్లు.. దిల్లీ 154/6 - ఐపీఎల్ 2021 లైవ్ స్కోర్
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ తడబడింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 43 పరుగులతో రాణించాడు.
ఐపీఎల్
తర్వాత వచ్చిన హెట్మెయర్ కాసేపు రాజస్థాన్ బౌలర్లను కాచుకుని దిల్లీ ఇన్నింగ్స్‌ను గాడినపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన బ్యాట్స్‌మెన్ రాజస్థాన్ బౌలర్లను ఎదుర్కోవడంలో విఫలమవడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులకు పరిమితమైంది దిల్లీ.