ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టు 54 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆర్సీబీ జట్టులో మాక్స్‌వెల్ (56: 37 బంతుల్లో 6X4, 3X6), కెప్టెన్ కోహ్లీ(51: 42 బంతుల్లో 3X4, 3X6) అర్ధసెంచరీలతో రాణించారు. శ్రీకర్ భరత్(32) ఫర్వాలేదనిపించాడు.
IPL 2021: ముంబయి ఇండియన్స్‌పై ఆర్సీబీ విజయం
ఐపీఎల్ రెండో దశలో తొలి విజయాన్ని నమోదు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగులు తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్
ఇక 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి 18.1 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ(43), డికాక్(24) పరుగులు చేశారు. మిగతావారు విఫలమవడంతో రోహిత్ సేన ఓడిపోయింది.
ఇదీ చూడండి:IPL 2021: కోహ్లీ, మ్యాక్స్‌వెల్ మెరుపులు .. ముంబయి లక్ష్యం 166
Last Updated : Sep 26, 2021, 11:40 PM IST