ఐపీఎల్లో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ముంబయి బౌలింగ్ ఎంచుకుంది.
పాయింట్ల పట్టికలో ముంబయి ఇండియన్స్ నాలుగో స్థానంలో ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థాంలో కొనసాగుతోంది. రెండు జట్లూ అన్ని విభాగాలలో బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆరేసి మ్యాచ్‌లాడిన ఇరుజట్లలో రోహిత్ సేన మూడు పరాజయాలు, మూడు విజయాలతో ఉండగా.. ధోనీ సేన ఐదు విజయాలను ఖాతాలో వేసుకుంది.
ఈ మ్యాచ్ కోసం ముంబయి జట్టు రెండు మార్పులు చేయగా, పాత జట్టుతోనే బరిలో దిగింది చెన్నై.