ఐపీఎల్ రెండో దశను విజయంతో ఆరంభించిన కోల్‌కతా నైట్ రైడర్స్.. ముంబయి ఇండియన్స్‌తో(MI vs KKR 2021) తలపడేందుకు సిద్ధమైంది. నేడు(సెప్టెంబరు 23) అబుదాబి వేదికగా ఇరు జట్లు పోటీ పడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ చేతిలో ఓడిన ముంబయి(MI vs CSK).. ఈ పోరులో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉండగా.. కేకేఆర్ కూడా విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని కసితో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలపై ఓ లుక్కేద్దాం..
ముంబయికి విజయం దక్కేనా?
రెండో విడత తొలి మ్యాచ్‌లో సీఎస్కే చేతిలో ఓడిన ముంబయి టీమ్‌లో సారథి రోహిత్ శర్మ(Rohit Sharma news), స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య లేని లోటు స్పష్టంగా కనిపించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌరభ్ తివారి(50*) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. అయితే కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లోనూ రోహిత్, హార్దిక్ ఆడతారో లేదో స్పష్టత లేదు. హిట్‌మ్యాన్ అందుబాటులోకి వస్తాడని హెడ్ కోచ్ మహేళా జయవర్దనే చెప్పగా..ఆడే అవకాశం తక్కువని పేసర్ ట్రెంట్ బౌల్ట్ అన్నాడు. ఇద్దరు కీలక ఆటగాళ్లు లేకుండా ముంబయి ఎలా ఆడుతుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ విషయానికొస్తే బుమ్రా, బౌల్ట్, మిల్నే, చాహర్‌తో పటిష్ఠంగానే ఉంది.
ఫామ్లోకేకేఆర్