ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో క్రికెట్‌తో పాటు ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేది. చీర్‌గర్ల్ డ్యాన్స్‌లతో అలరిస్తుంటే.. అభిమానుల కోలాహలం మధ్య ప్రతి మ్యాచ్ పండగ వాతావరణాన్ని తలపించేంది. కానీ, గతేడాది నుంచి కరోనా కారణంగా స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించలేదు. అయితే ఐపీఎల్‌లోని గత కొన్ని సీజన్లలో మ్యాచ్‌లను వీక్షించేందుకు వచ్చిన అందమైన అమ్మాయిలు కెమెరా కంట పడుతున్నారు. తమ అందాలతో అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా.. ఒక్క చూపుతోనే సోషల్‌మీడియాలో ఎంతో క్రేజ్ సంపాదించేస్తున్నారు. ఇలా చాలామంది యువతులు మ్యాచ్‌లు చూసేందుకు వచ్చి, కెమెరా కంటికి చిక్కి పాపులర్ అయిపోతున్నారు. అయితే ఆ అమ్మాయిల పేర్లు, వివరాలను తెలుసుకునేందుకు నెటిజన్లు, సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. అలా ఫ్యాన్స్ గుండెలకు చూపులతో బాణాలు గుచ్చిన సుందరిమణులు ఎవరెవరంటే?
1) కావ్య మారన్
ఐపీఎల్-2018లో చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు ఎస్ఆర్హెచ్కు మద్దతుగా వచ్చిన అమ్మాయి.. ఓ క్రమంలో కెమోరాకు చిక్కింది. ఆమెను చూసిన వారంతా ఫిదా అయ్యారు. అయితే ఆ అమ్మాయి ఎవరి ఆరా తీయగా.. ఆమె సన్‌రైజర్స్ యజమాని కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్. సన్ టీవీ నెట్వర్క్ వ్యవస్థాపకురాలు ఈమె.
2) ఆశ్రితా శెట్టి
కర్ణాటకకు చెందిన అశ్రితా శెట్టి.. తమిళ చిత్రాల్లో హీరోయిన్గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే భార్య ఈమె. హైదరాబాద్ జట్టు ఆడిన ఓ మ్యాచ్‌లో స్టేడియానికి వచ్చి.. ఇలా కెమెరా కంట పడింది.
3) మాలతి చాహర్