కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు భారత్‌లో ఆడిన మ్యాచ్‌ల్లో అదృష్టం (ipl 2021 kkr latest news) కలిసిరాలేదనే చెప్పాలి. ఎందుకుంటే భారత్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్.. రెండు విజయాలు మాత్రమే సాధించింది. మోర్గాన్ సేన.. ఈ సీజన్‌ని విజయంతో ఆరంభించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీశ్ రాణా(80 పరుగులు) రాణించడంతో 10 పరుగుల తేడాతో గెలుపొందింది. తర్వాత కేకేఆర్‌కు కాలం కలిసిరాలేదు. ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ చేతిలో వరుసగా ఓటములపాలైంది. తర్వాత పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోరులో నెగ్గినా.. దిల్లీ క్యాపిటల్స్ చేతిలో కంగుతింది. అనంతరం బయోబుడగలో ఉన్న ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఐపీఎల్ వాయిదాపడింది.
యూఏఈలో కోల్'కథ'మలుపు తిరిగింది
కరోనా కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లు యూఏఈకి మారడం కేకేఆర్‌కు బాగా కలిసొచ్చింది. యూఏఈలో ఏడు లీగ్ మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా ఐదింటిలో విజయం సాధించింది. రెండో దశను మోర్గాన్ సేన భారీ విజయంతో ఆరంభించింది. ఆర్‌సీబీని 92 పరుగులకే ఆలౌట్ చేసి 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తర్వాత బలమైన ముంబయి ఇండియన్స్‌ని మట్టకరిపించింది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైనా.. అనంతరం దిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లను ఓడించి ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. తర్వాత సన్‌రైజర్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టుని 115 పరుగులకే కట్టడి చేసినా.. లక్ష్యాన్ని ఛేదించేందుకు కోల్‌కతా చెమటోడ్చింది. నాలుగు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో 86 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి 14 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. లీగ్ దశ ముగిసేసరికి ముంబయి ఇండియన్స్ కూడా 14 పాయింట్లు సాధించింది. కానీ, మెరుగైన రన్‌రేట్ ఉన్న కారణంగా కోల్‌కతా ప్లే ఆఫ్స్‌కి చేరింది.
నరైన్ స్పిన్ మయాజాలం.. క్వాలిఫయర్-2కి కోల్‌కతా..