ఐపీఎల్-14 సీజన్ రెండో దశలో(IPL 2021 News) కోల్‌కతా నైట్‌రైడర్స్ శుభారంభం చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో(rcb vs kolkata 2021) జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు శుభమన్ గిల్ (48), వెంకటేశ్ అయ్యర్ (41)రాణించడం వల్ల ఆర్సీబీ నిర్దేశించిన 93 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా 10.5 ఓవర్లలోనే ఛేదించింది. చాహల్ వేసిన 9.1 ఓవర్‌కు శుభమన్ గిల్ సిరాజ్‌కు చిక్కాడు. బెంగళూరు బౌలర్లలో చాహల్ ఒక వికెట్ తీశాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీని కేకేఆర్(kkr won the match) బౌలర్లు హడలెత్తించారు. ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. ఫామ్‌లేమితో సతమవుతోన్న కోహ్లీ(kohli ipl performance) ఈ మ్యాచ్‌లోనైనా ఆకట్టుకుంటాడని అభిమానులు భావించారు. కానీ వారిని మరోసారి నిరాశపరుస్తూ 5 పరుగులకే పెవిలియన్ చేరాడీ స్టార్ క్రికెటర్. కాసేపు క్రీజులో నిలిచిన మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 22 పరుగులు చేసి ఫెర్గుసన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాసేపటికే ఐపీఎల్లో మొదటి మ్యాచ్ ఆడుతున్న తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ (16) రసెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం డివిలియర్స్ (0) డకౌట్‌గా వెనుదిరగడం వల్ల 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ.