తెలంగాణ

telangana

ETV Bharat / sports

వెంకటేశ్, త్రిపాఠి విధ్వంసం.. ముంబయిపై కేకేఆర్ ఘనవిజయం

ముంబయి ఇండియన్స్​తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్​లో ఘనవిజయం సాధించింది కోల్​కతా నైట్​రైడర్స్. ముంబయి విధించిన 156 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

kolkata
కోల్​కతా

By

Published : Sep 23, 2021, 10:57 PM IST

ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో అద్భుత విజయం సాధించింది కోల్​కతా నైట్​రైడర్స్. లీగ్ రెండో దశలో తొలి మ్యాచ్​లో బెంగళూరును మట్టికరిపించిన కోల్​కతా.. ఈ మ్యాచ్​లో పటిష్ట ముంబయిని చిత్తుచేసింది.
తొలుత టాస్ గెలిచి ముంబయికి బ్యాటింగ్ అప్పగించిన కోల్​కతా ప్రత్యర్థిని 155 పరుగులకే కట్టడి చేసింది. ముఖ్యంగా రోహిత్, డికాక్​ శుభారంభం అందించినా.. పక్కా ప్రణాళికతో వారిని బోల్తా కొట్టించిన కేకేఆర్ తర్వాత జట్టును కోలుకోకుండా చేసింది.
అనంతరం బ్యాటింగ్​లో విధ్వంసం సృష్టించింది కోల్​కతా. ఓపెనర్ గిల్ (13) తక్కువ స్కోర్​కే ఔటైనా.. రాహుల్ త్రిపాఠితో కలిసి యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు. వీరిద్దరూ ముంబయి బౌలర్లను ఊచకోత కోశారు. బుమ్రా, బౌల్ట్, ఆడం మిల్నే వంటి టాప్ క్లాస్ బౌలర్లను ఉతికారేశారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్​తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన అయ్యర్.. ఆ మ్యాచ్​లో ఆకట్టుకున్నాడు. తాజాగా ఈ మ్యాచ్​లో తనలోని విధ్వంసాన్ని బయటకుతీశాడు. 25 బంతుల్లోనే అర్ధశతకం చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. తర్వాత మరో మూడు పరుగులు చేసి బుమ్రా బౌలింగ్​లో ఔటయ్యాడు. మరోవైపు రాహుల్​ త్రిపాఠి కూడా బ్యాట్​ ఝళిపించాడు. 29 బంతుల్లోనే హాఫ్​ సెంచరీ చేసి తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ మోర్గాన్ (7) విఫలమైనా నితీశ్ రానాతో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ క్రమంలోనే 74* పరుగులతో నాటౌట్​గా నిలిచాడు త్రిపాఠి.

ముంబయి తడబాటు
టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన ముంబయికి ఓపెనర్లు రోహిత్ శర్మ (33), డికాక్ (55) శుభారంభాన్ని ఇచ్చారు. మొదటి బంతికే ఫోర్​తో ఇన్నింగ్స్​ను ఆరంభించిన హిట్​మ్యాన్​ వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ దాటించాడు. మొదట నెమ్మదిగా ఆడిన డికాక్​ తర్వాత రెచ్చిపోయాడు. ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో పవర్​ప్లే ముగిసే సరికి 56 పరుగులు చేసింది ముంబయి. అనంతరం 10వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి నరైన్ బౌలింగ్​లో ఔటయ్యాడు రోహిత్ (33). కాసేపటికే సూర్యకుమార్ (5) కూడా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలోనే సమయోచితంగా ఆడిన డికాక్​ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. మరో ఐదు పరుగులు జోడించిన ఇతడు 55 పరుగులు చేసి ప్రసిధ్ కృష్ణ బౌలింగ్​లో ఔటయ్యాడు.
అనంతరం ఇషాన్ కిషన్ (14) భారీ షాట్​కు ప్రయత్నించి ఫెర్గుసన్ బౌలింగ్​లో క్యాచ్ ఔట్​గా వెనుదిరిగాడు. చివర్లో కోల్​కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. దీంతో పరుగులు రాబట్టడానికి కష్టపడ్డారు పొలార్డ్ (21), కృనాల్ (12) పాండ్యా. 6వ వికెట్​కు 30 పరగులు జోడించిన వీరిద్దరూ ఫెర్గుసన్ వేసిన చివరి ఓవర్లో వరుస బంతుల్లో ఔటయ్యారు. చివరి బంతికి సౌరభ్ తివారి ఫోర్ బాదడం వల్ల ముంబయి ఇన్నింగ్స్​ 155 పరుగుల వద్ద ముగిసింది.

కోల్​కతా బౌలర్లలో ఫెర్గుసన్, ప్రసిధ్ చెరో 2 వికెట్లతో రాణించగా నరైన్​కు ఒక వికెట్ దక్కింది.

ఇదీ చూడండి: డికాక్ హాఫ్ సెంచరీ.. కోల్​కతా లక్ష్యం 156

ABOUT THE AUTHOR

...view details