ఐపీఎల్ 2021(IPL 2021 News)లో మరో హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. నేడు (అక్టోబర్ 1) కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది పంజాబ్ కింగ్స్(KKR vs PBKS 2021). ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
ప్లే ఆఫ్స్ రేసులో సజీవంగా నిలవాలంటే ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్‌లో విజయం చాలా అవసరం. దీంతో ఇరుజట్లు ప్రాక్టీస్‌లో శ్రమిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి.
తుదిజట్లు:
పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్, వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, మార్కరమ్, నికోలస్ పూరన్, షారుక్ ఖాన్, దీపక్ హుడా, ఫాబిన్ అలెన్, నాథన్ ఎల్లీస్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్.
కోల్‌కతా నైట్‌రైడర్స్: శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), నితీశ్ రానా, దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), టిమ్ సైఫెర్ట్, సునీల్ నరైన్, శివమ్ మావి, టిమ్ సౌథి, వరుణ్ చక్రవర్తి.
ఇదీ చూడండి..dhoni catches record: ఐపీఎల్లో ధోనీ సరికొత్త రికార్డు