రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపై స్పందించాడు కోల్‌కతా నైట్ రైడర్స్ చీఫ్ మెంటర్ డేవిడ్ హస్సీ. ఈ మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు ప్రణాళికకు విరుద్ధంగా ఆడారని తెలిపాడు. తమ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సీజన్ పూర్తయ్యే సమయానికి అత్యధిక పరుగుల జాబితాలో ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"ఓపెనర్ శుభ్‌మన్ గిల్ స్టార్ ప్లేయర్. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లో అంచనాలకు మించి రాణించాడు. అతని విషయంలో నేనొకటి చెప్పగలను. ఫామ్ వస్తుంది పోతుంది. కానీ, క్లాస్ అనేది క్రికెట్లో చాలా ముఖ్యం. అతడొక అద్భుతమైన క్లాస్ ఆటగాడు. నేను చెప్పేది గుర్తు పెట్టుకోండి. ఈ లీగ్ పూర్తయ్యేసరికి అత్యధిక పరుగుల జాబితాలో అతడు ఉంటాడు."
-డేవిడ్ హస్సీ, కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటర్.