ఆదివారం సూపర్ ఓవర్‌కు దారితీసిన దిల్లీతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి చెందింది. తమ ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన హైదరాబాద్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్.. సూపర్ ఓవర్లోనూ ఆడాడు. అయితే రెండో సారి బ్యాటింగ్‌కు దిగినప్పుడు తాను బాగా అలసిపోయానని చెప్పాడు. మ్యాచ్‌లో తమ జట్టుకు చాలా సానుకూల అంశాలు కనిపించాయని చెప్పాడు. ఎంతో ఆసక్తిగా గేమ్ సాగిందని అన్నాడు.
సూపర్ ఓవర్‌పై ధావన్ అలా.. కేన్ ఇలా! - kane williamson super over
దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తమ జట్టుకు అనేక సానుకూల అంశాలు కనిపించాయని సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. కాగా, ఈ మ్యాచ్ టై కాకుండానే తాము సులభంగా గెలవాల్సిందని అన్నాడు దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు ధావన్.
దిల్లీxహైదరాబాద్
కాగా, ఈ మ్యాచ్ టై కాకుండానే తాము సులభంగా గెలవాల్సిందని అన్నాడు దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు ధావన్. తాము కొన్ని తప్పులు చేయడం వల్లే ఇలా జరిగిందని చెప్పాడు. కేన్ విలియమ్సన్ అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు.
ఈ మ్యాచ్ సూపర్ ఓవర్లో మొదట హైదరాబాద్ 7 పరుగులు చేసింది. చివరి బంతికి వార్నర్ రెండు పరుగులు తీసినా.. బ్యాట్‌ను క్రీజులో సరిగా పెట్టకపోవడం వల్ల ఒక పరుగు తగ్గింది. ఛేదనలో తీవ్ర ఉత్కంఠ మధ్య దిల్లీ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది.