ఇంగ్లాండ్తో జరగాల్సిన ఐదో టెస్టు(IND Vs ENG 5th Test) రద్దు అయిన కారణంగా తమ ఆటగాళ్లను యూఏఈ రప్పించేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు(IPL Franchises) కసరత్తులు చేస్తున్నాయి. ఆటగాళ్ల కోసం మాంచెస్టర్ నుంచి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయనున్నారని సమాచారం. ఇందుకోసం ఛార్టెర్ సంస్థలతో ఐపీఎల్ జట్టు యాజమాన్యాలు సంప్రదింపులు జరిపాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రికి ఆటగాళ్లందరూ యూఏఈ చేరుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
భారత క్రికెటర్లతో ఇంగ్లాండ్ ఆటగాళ్లను యూఏఈ రప్పించేందుకు ఇప్పటికే కసరత్తులు మొదలయ్యాయని ఓ ఫ్రాంఛైజీకి చెందిన అధికారులు వెల్లడించారు. బీసీసీఐ నుంచి ఒకసారి అనుమతి వచ్చిన వెంటనే క్రికెటర్ల కోసం చార్టెర్ విమానాలు సిద్ధంగా ఉంచుతామని తెలిపారు. శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయాన్నే కుటుంబాలతో పాటు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు.
సాధారణ విమానాల్లో..