తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2021: ఐపీఎల్​ రెండో దశకు కొత్త ఆటగాళ్లు వీరే! - ఐపీఎల్​ జట్లు

సెప్టెంబరులో దుబాయి వేదికగా ప్రారంభం కానున్న ఐపీఎల్​ (IPL 2021) రెండో దశకు జట్లన్నీ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆర్​సీబీ, రాజస్థాన్​ రాయల్స్​, పంజాబ్​ కింగ్స్​మార్పులు చేసినట్లు ప్రకటించగా.. తాజాగా కోల్​కతా నైట్​ రైడర్స్​ కూడా ఆసీస్​ బౌలర్​ ప్యాట్​ కమిన్స్​ స్థానంలో కివీస్​ పేసర్​ టిమ్​ సౌథీని జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు తమ జట్టు సభ్యులు పాండ్యా బ్రదర్స్​ యూఏఈ చేరుకున్నట్లు ముంబయి ఇండియన్స్​ పేర్కొంది.

IPL 2021
ఐపీఎల్​ 2021

By

Published : Aug 26, 2021, 6:34 PM IST

యూఏఈలో ఐపీఎల్​ రెండో దశ(IPL 2021) పునఃప్రారంభానికి ముందు తమ జట్లను సన్నద్ధం చేసుకుంటున్నాయి ఫ్రాంచైజీలు. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్​సీబీ), రాజస్థాన్ రాయల్స్(ఆర్​ఆర్​), పంజాబ్ కింగ్స్(పీబీకేఎస్​) తమ జట్టుల్లో మార్పు చేసినట్లు ప్రకటించాయి. కాగా తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్​(కేకేఆర్​)కు ఆసీస్ స్టార్ బౌలర్​ ప్యాట్ కమిన్స్ దూరం కాగా.. అతడి స్థానాన్ని కివీస్​ బౌలర్​ టిమ్​ సౌథీతో భర్తీ చేయనున్నట్లు తెలిపింది జట్టు యాజమాన్యం.

టిమ్​ సౌథీ

ఆర్​సీబీలో ముగ్గురు

రెండోదశ ఐపీఎల్​కు ముందు ఆర్​సీబీలోనూ మార్పులు జరిగాయి. తమ ఆటగాళ్లలో డేనియల్​ శామ్స్ స్థానంలో శ్రీలంకకు చెందిన దుష్​మంత చమీరా, ఫిన్​ అలెన్ స్థానంలో సింగపూర్​ ఆటగాడు టిమ్​ డేవిడ్​లు జట్టులోకి రానున్నట్లు ఇప్పటికే ఆర్​సీబీ తెలిపింది. అలాగే స్పిన్నర్​ ఆడమ్​ జంపా స్థానంలో శ్రీలంక స్పిన్నర్​ వానిందు హసరంగను ఫ్రాంచైజీ నియమించింది. ఇటీవల భారత్​తో జరిగిన సిరీస్​లో మెరుగైన ప్రదర్శన చేసిన హసరంగపై ఆర్​సీబీకి భారీ అంచనాలు ఉన్నాయి.

మరోవైపు రాజస్థాన్ రాయల్స్​.. ఇంగ్లాండ్ స్టార్​ బౌలర్​ జోఫ్రా ఆర్చర్‌కు స్థానంలో కివీస్​ వికెట్​ కీపర్​-బ్యాట్స్‌మన్ గ్లెన్ ఫిలిప్స్‌ను జట్టులోకి తీసుకుంది. ఫిలిప్స్ ఇప్పటివరకు 25 టీ20ల్లో 506 పరుగులు చేశాడు. అలాగే ఆండ్రూ టై స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు తబ్రాజ్ షమ్సీని నియమించనుంది.

గ్లెన్ ఫిలిప్స్‌

యువ ఆటగాళ్లకు అవకాశం

రిలే మెరిడిత్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆస్ట్రేలియా బౌలర్​ నాథన్​ ఎల్లిస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది పీబీకేఎస్​. ఇటీవల బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ అరంగేట్ర మ్యాచ్​లో హ్యాట్రిక్​తో మెరిశాడు ఎల్లిస్. ఆస్ట్రేలియా 2021 టీ20 ప్రపంచకప్​​ జట్టులో రిజర్వు​ ఆటగాళ్లలో కుడిచేతి వాటం​ పేసర్​గా ఉన్నాడు. మరో ఆటగాడు జ్యారీ రిచర్డ్‌సన్ స్థానంలో ఇంగ్లాండ్ స్పిన్నర్​ అదిల్​ రషీద్‌ని కూడా పీబీకేఎస్​ ఎంపిక చేసింది.

యూఏఈలో పాండ్యా బ్రదర్స్​

మిగిలిన ఐపీఎల్ మ్యాచ్​లు ఆడేందుకు ఇప్పటికే యూఏఈ చేరుకున్న చెన్నై(సీఎస్​కే), ముంబయి(ఎంఐ) జట్లు కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో మిగిలిన ఆటగాళ్లు ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటున్నారు. తాజాగా ముంబయి ఇండియన్స్ స్టార్​ ఆల్​రౌండర్స్​ కృనాల్ పాండ్యా, హార్ధిక్​ పాండ్యా యూఏఈ చేరుకున్నట్లు ప్రకటించింది. ​

యూఏఈలో పాండ్యా బ్రదర్స్​

ఇవీ చూడండి:

IPL 2021: ఆ మ్యాచ్​లకు కమిన్స్​ దూరం!

టీ20 టాప్​ బౌలర్​తో రాజస్థాన్​ రాయల్స్​ ఒప్పందం

IPL 2021: పోరుకు సిద్ధమవుతున్న సీఎస్కే, ముంబయి

ABOUT THE AUTHOR

...view details