తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2021 Final: డుప్లెసిస్​ మెరుపు ఇన్నింగ్స్​.. కోల్​కతా లక్ష్యం 193 - CSK vs KKR IPL Match Today

కోల్​కతా నైట్​రైడర్స్​తో జరుగుతోన్న మ్యాచ్​ చెన్నై సూపర్​కింగ్స్​ బ్యాటింగ్​ విభాగం అదరగొట్టింది. టాస్​ ఓడి బ్యాటింగ్​కు వచ్చిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు రాబట్టింది. ఫాఫ్​ డుప్లెసిస్​(86) అర్థశతకంతో ఆకట్టుకోగా.. రుతురాజ్​ గైక్వాడ్​(32), రాబిన్​ ఉతప్ప(31), మొయిన్​ అలీ(37) రాణించారు. మరోవైపు కోల్​కతా బౌలర్​ సునీల్​ నరైన్​ 2, శివమ్​ మావి ఒక వికెట్​ పడగొట్టారు.

IPL 2021 Final, CSK Vs KKR
చెన్నై వర్సెస్​ కోల్​కతా

By

Published : Oct 15, 2021, 9:17 PM IST

Updated : Oct 15, 2021, 10:16 PM IST

కోల్‌కతాతో జరుగుతున్న ఐపీఎల్‌ తుదిపోరులో చెన్నై బ్యాటర్లు చెలరేగారు. సీఎస్‌కే ఓపెనర్ డుప్లెసిస్‌ (86) సూపర్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లను కోల్పోయి 192 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్‌కు 193 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. చెన్నై ఓపెనర్లు డుప్లెసిస్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌(32) జంట తొలి వికెట్‌కు(61 పరుగులు) శుభారంభం అందించారు. రుతురాజ్‌ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రాబిన్‌ ఉతప్ప(31) ధాటికి ఆడాడు. ఈ క్రమంలో షాట్‌కు యత్నించి నరైన్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు.

రుతురాజ్‌ కూడా నరైన్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. రుతురాజ్‌, ఉతప్ప ఔటైనా చెన్నై దూకుడు మాత్రం తగ్గలేదు. ఓ ఎండ్‌లో డుప్లెసిస్‌ అర్ధశతకం సాధించి ఫాస్ట్‌గా ఆడగా.. మరోవైపు మొయిన్‌ అలీ (34) బీభత్సం సృష్టించాడు. అయితే ఇన్నింగ్స్‌ చివరి బంతికి డుప్లెసిస్‌ ఔటయ్యాడు. కోల్‌కతా బౌలర్లలో నరైన్ రెండు వికెట్లు, శివమ్‌ మావి ఒక వికెట్‌ పడగొట్టారు. మిగిలిన కేకేఆర్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

ఇదీ చూడండి..IPL 2021 Final: టాస్​ గెలిచిన కోల్​కతా.. చెన్నై బ్యాటింగ్​

Last Updated : Oct 15, 2021, 10:16 PM IST

ABOUT THE AUTHOR

...view details