తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఈ ఐపీఎల్​లో కేఎల్​ రాహుల్​ కొత్త కోణం చూస్తారు' - KL RAHUL PUNJAB KINGS

ఐపీఎల్​లో తమ కెప్టెన్ కేఎల్ రాహుల్​ ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పంజాబ్ కోచ్ వసీం జాఫర్. కచ్చితంగా మెరుగ్గా ఆడతాడని, అభిమానులు అతడి కొత్త కోణం చూస్తారని అన్నాడు.

KL Rahul IPL 2021
కేఎల్​ రాహుల్

By

Published : Apr 1, 2021, 7:48 PM IST

త్వరలో మొదలయ్యే ఐపీఎల్​​లో కేఎల్ రాహుల్​లోని కొత్త కోణాన్ని చూస్తారని పంజాబ్ కింగ్స్ కోచ్ వసీమ్ జాఫర్ అన్నాడు. బ్యాటింగ్​లో మరింత దూకుడు ప్రదర్శిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

యూఏఈలో జరిగిన గత సీజన్​లో రాహుల్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్​ల్లో 670 పరుగులు చేసి, ఆ సీజన్​లో ఎక్కువ రన్స్ చేసిన బ్యాట్స్​మన్​గా నిలిచాడు. అయితే ఇటీవల ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్​లో ఘోరంగా విఫలమయ్యాడు. 4 మ్యాచ్​ల్లో కేవలం 15 పరుగులే చేసి నిరాశపరిచాడు.

కేఎల్​ రాహుల్​

"గత సీజన్​లో జట్టు బాధ్యతల్ని తన భుజాన వేసుకుని, కేఎల్ రాహుల్ బ్యాటింగ్​ చేశాడు. ఈసారి మాత్రం తనలో కొత్త కోణాన్ని మీరు చూస్తారు. ఓ టీ20 సిరీస్​లో విఫలమైనంత మాత్రాన అతడు చెడ్డ బ్యాట్స్​మన్​ అని అనరు. ఇలాంటి పరిస్థితి అందరూ ప్లేయర్లకు వస్తుంది" అని జాఫర్ అన్నాడు.

ఈ సీజన్​లో పంజాబ్ కింగ్స్, తన తొలి మ్యాచ్​ను రాజస్థాన్ రాయల్స్​తో ఏప్రిల్ 12న ఆడనుంది.

ABOUT THE AUTHOR

...view details