దిల్లీతో మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్.. బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే తొలి పోరులో విజయం సాధించిన క్యాపిటల్స్.. దానిని కొనసాగించాలని భావిస్తోంది. తక్కువ పరుగుల తేడాతో తొలి మ్యాచ్ కోల్పోయిన రాయల్స్.. ఇందులో గెలవాలని ప్రణాళికలు వేస్తోంది. మరి లక్ ఎవరిని వరిస్తుందో?
జట్లు
దిల్లీ: శిఖర్ ధావన్, పృథ్వీషా, అజింక్య రహానె, పంత్(కెప్టెన్), స్టోయినిస్, రబాడా, వోక్స్, అశ్విన్, టామ్ కరన్, లలిత్ యాదవ్, ఆవేశ్ ఖాన్
రాజస్థాన్: బట్లర్, మనన్ వోహ్రా, డేవిడ్ మిల్లర్, సంజూ శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, శివం దూబే, రాహుల్ తెవాతియా, క్రిస్ మోరిస్, ఉనద్కత్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్.