ఒక రూమ్లో ముగ్గురు ఉంటే.. ఆ క్రికెటర్ నలుగురి కోసం ఫుడ్ ఆర్డర్ ఇస్తాడు!, ఒక్కొక్కసారి తోటి క్రికెటర్ల చెప్పులను స్విమ్మింగ్ పూల్లో పడేస్తాడు,! ఎప్పుడూ చిలిపి చేష్టలు చేస్తూ తన చుట్టూ ఉన్నవారిని నవ్విస్తాడు!.. ఇలాంటి పనులు చేసేది ఎవరో కాదు.. దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్(Rishabh Pant News). సోమవారం పంత్ పుట్టినరోజు(Rishabh Pant Birthday) సందర్భంగా అతడి గురించి తన తోటి ఆటగాళ్లు చెప్పిన ఆసక్తికర విశేషాలివే! దిల్లీ క్యాపిటల్స్ జట్టులోని పలువురు ఆటగాళ్లు పంత్ గురించి మరెన్నో కబుర్లు చెప్పారు. అవేంటో తెలుసుకుందాం.
"రూమ్లో ముగ్గురు ఆటగాళ్లు ఉంటే.. నలుగురికి సరిపడే ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. అంత తిండి ఎవరు తింటారు అని నేను అతడితో(పంత్) తరచుగా గొడవ పడుతుంటా. నేను తిట్టినా తింటూనే ఉంటాడు. ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ మా ఇద్దరి మధ్య చాలానే జరిగాయి. అయితే పంత్ ఒకసారి చేసిన పనిని మళ్లీ మళ్లీ చేయడు. అది అతడిలోని మంచి పద్ధతి. దేనిపై వ్యసనం పెంచుకోడు."
- అక్షర్ పటేల్, దిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్.
"గతేడాది పంత్.. నా చెప్పులను స్విమ్మింగ్ పూల్లో పడేశాడు. కెప్టెన్సీని ఎప్పుడూ ఆస్వాదిస్తూనే ఉంటాడు. మానసికంగానూ చాలా ఆహ్లాదంగా ఉంటూ.. తోటి ఆటగాళ్లతో సరదాగా ఉంటాడు. నేను పొరపాట్లు చేసిన సమయంలో నాకు మద్దతుగా ఉన్నాడు. నేను బాగా బౌలింగ్ చేసినప్పుడు అభినందించాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ చేయాలో చెప్పాడు".