దిల్లీ క్యాపిటల్స్‌కు మరో దెబ్బ! ఆ జట్టు బౌలర్ అన్రిచ్ నోర్జేకు కరోనా పాజిటివ్‌గా తేలింది. స్వదేశంలో పాకిస్థాన్‌తో వన్డే సిరీస్ ఆడిన ఈ దక్షిణాఫ్రికా బౌలర్.. ఇటీవల ముంబయి చేరుకుని, క్వారంటైన్లో ఉన్నాడు. తాజాగా చేసిన వైద్యపరీక్షల్లో అన్రిచ్‌కు పాజిటివ్‌గా తేలింది. దీంతో మరికొన్నిరోజుల పాటు, అతడు బయో బబుల్ బయట క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెగిటివ్ వస్తేనే జట్టుతో కలుస్తాడు.
దిల్లీ క్యాపిటల్స్ మరో బౌలర్‌కు కరోనా - క్రికెట్ న్యూస్
ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ మరో ఆటగాడికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. అక్షర్ పటేల్‌కు ఇప్పటికే పాజిటివ్ రాగా, ఇప్పుడు అన్రిచ్ నోర్జే కూడా వైరస్ బారినపడ్డాడు.
దిల్లీ క్యాపిటల్స్ మరో బౌలర్‌కు కరోనా
కరోనా కారణంగా అక్షర్ పటేల్ ఇప్పటికే క్వారంటైన్లో ఉండగా, గాయం కారణంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. దీంతో పంత్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో చెన్నైపై గెలిచిన దిల్లీ.. రాజస్థాన్ రాయల్స్‌తో గురువారం తర్వాతి మ్యాచ్ ఆడనుంది.
ఇది చదవండి:'మాస్టర్' పాటకు దిల్లీ క్రికెటర్ల చిందులు