తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆర్సీబీ ఆల్​రౌండర్ డేనియల్ సామ్స్​కు నెగిటివ్ - ఆర్సీబీ ఆల్​రౌండర్ డేనియల్ సామ్స్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్​రౌండర్ డేనియల్ సామ్స్​కు కరోనా నెగిటివ్​గా తేలింది. ప్రస్తుతం అతడు బయోబబుల్​లో జట్టుతో కలిశాడు.

Daniel Sams
డేనియల్ సామ్స్

By

Published : Apr 17, 2021, 4:38 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్​రౌండర్ డేనియల్ సామ్స్​కు కరోనా నెగిటివ్​గా తేలింది. దీంతో ఇతడు బయోబబుల్​లో జట్టుతో కలిశాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ వెల్లడించింది.

ఐపీఎల్​ కోసం చెన్నై చేరిన సమయంలో తొలి టెస్టులో సామ్స్​కు నెగిటివ్​ రాగా రెండో టెస్టులో పాజిటివ్​గా తేలింది. దీంతో ఇతడు క్వారంటైన్​లో ఉన్నాడు. తాజాగా మరోసారి చేసిన పరీక్షల్లో నెగిటివ్ రావడం వల్ల జట్టుతో కలిశాడు.

"రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్​రౌండర్ డేనియల్ సామ్స్​కు కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిపేందుకు సంతోషిస్తున్నాం. ప్రస్తుతం అతడు ఆర్సీబీ బయోబబుల్​లో చేరాడు" అని ట్వీట్ చేసింది ఫ్రాంచైజీ.

కరోనా నుంచి కోలుకున్న రెండో ఆర్సీబీ ఆటగాడు సామ్స్. ఇంతకుముందు కొవిడ్ బారినపడిన యువ ఓపెనర్ దేవ్​దత్ పడిక్కల్ నెగిటివ్​ రావడం వల్ల రెండో మ్యాచ్​లో బరిలో దిగాడు.

ABOUT THE AUTHOR

...view details