ఐపీఎల్-14 (iPL 2021) సీజన్ రెండో దశలో చెన్నై సూపర్ కింగ్స్ (Ml vs CSK) శుభారంభం చేసింది. ముంబయి ఇండియన్స్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించి ఈ సీజన్ తొలి దశలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. చెన్నై నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ ఛేదించలేకపోయింది (csk vs mi 2021 scorecard). 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబయి ఆటగాళ్లలో సౌరభ్ తివారీ (50*) ఒక్కడే రాణించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. ఓపెనర్ క్వింటన్ డికాక్(17) మూడు ఫోర్లు కొట్టి ఊపుమీద కనిపించినా.. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఎల్బీడబ్యూగా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ అన్మోల్ ప్రీత్ సింగ్(16), సూర్యకుమార్ యాదవ్(3), ఇషాన్ కిషన్(11), కెప్టెన్ పొలార్డ్(15), కృనాల్ పాండ్య(4) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. చెన్నై బౌలర్లలో బ్రావో మూడు, దీపక్ చాహర్ రెండు, హేజిల్ వుడ్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు.
Ml vs CSK: ప్రతీకారం తీర్చుకున్న సీఎస్కే.. ముంబయిపై విజయం - csk vs mi 2021 scorecard
ఐపీఎల్ (iPL 2021) రెండో దశ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ (Ml vs CSK) గెలిచింది. 20 పరుగులు తేడాతో ముంబయి ఇండియన్స్‌ను ఓడించింది. సీఎస్కే విజయంలో రుతురాజ్ గైక్వాడ్(88*) కీలక పాత్ర పోషించాడు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీసేన.. తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయింది. డుప్లెసిస్, మొయిన్ అలీ డకౌటయ్యారు. తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ ధోనీ(3), రైనా(4) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయిన చెన్నైని రుతురాజ్ గైక్వాడ్ ఆదుకున్నాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. జడేజా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన బ్రావో (23; 8 బంతుల్లో 3 సిక్స్‌లు) బాదాడు. ఈ క్రమంలో బౌల్ట్ వేసిన 19వ ఓవర్‌లో 24 పరుగులు వచ్చాయి. బుమ్రా వేసిన చివరి ఓవర్‌లో రెండో బంతికి బ్రావో.. కృనాల్ పాండ్యకు చిక్కాడు. తర్వాత రుతురాజ్ ఓ ఫోర్, సిక్స్ బాదాడు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, మిల్నే, బుమ్రా తలో రెండు వికెట్లు పడగొట్టారు.
ఇదీ చూడండి:iPL 2021: అదరగొట్టిన గైక్వాడ్.. ముంబయి లక్ష్యం 157