తెలంగాణ

telangana

ETV Bharat / sports

CSK Vs PBKS: డుప్లెసిస్​ హాఫ్​సెంచరీ.. పంజాబ్​ లక్ష్యం 135 - చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్

ఐపీఎల్​లో గురువారం జరుగుతోన్న తొలి మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్​ బ్యాట్స్​మెన్​ తడబడ్డారు. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ధోనీసేన.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 134 పరుగుల తక్కువ స్కోరు నమోదు చేసింది. డుప్లెసిస్​(76) హాఫ్​సెంచరీతో ఆకట్టుకున్నాడు.

IPL 2021, CSK Vs PBKS
చెన్నై వర్సెస్​ పంజాబ్

By

Published : Oct 7, 2021, 5:20 PM IST

Updated : Oct 7, 2021, 5:42 PM IST

పంజాబ్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. 6 వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేసింది. డుప్లెసిస్‌ (76; 55 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి వరుస షాక్‌లు తగిలాయి. అర్ష్‌దీప్‌ సింగ్‌ వేసిన 3.5 బంతికి గైక్వాడ్.. షారూక్‌ఖాన్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటవగా.. తర్వాత వచ్చిన మొయిన్‌ అలీ డకౌటయ్యాడు.

ఆ తర్వాత బ్యాటింగ్​కు వచ్చిన రాబిన్‌ ఉతప్ప(2), అంబటి రాయుడు(4)లను జోర్డాన్‌ వరుస ఓవర్లలో ఔట్‌ చేసి చెన్నైకి గట్టి షాక్ ఇచ్చాడు. కుదురుకుంటున్నట్లు కనిపించిన ధోనీని(12) 12వ ఓవర్లో రవి బిష్ణోయ్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. జడేజా(15) ఫర్వాలేదనిపించాడు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, జోర్డాన్‌ రెండు.. రవి బిష్ణోయ్‌, షమీ తలో వికెట్‌ తీశారు.

ఇదీ చూడండి..CSK Vs PBKS: టాస్​ గెలిచిన పంజాబ్​.. చెన్నై బ్యాటింగ్​

Last Updated : Oct 7, 2021, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details