తెలంగాణ

telangana

ETV Bharat / sports

CSK Vs KKR: టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న కోల్​కతా - who won the toss today 2021

ఐపీఎల్​ రెండో దశలో భాగంగా మరి కాసేపట్లో చెన్నై సూపర్​ కింగ్స్​, కోల్​కతా నైటర్​ రైడర్స్​ మధ్య (CSK Vs KKR) మ్యాచ్ జరగనుంది. ముందుగా ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన కోల్​కతా బ్యాటింగ్​ ఎంచుకుంది.

CSK Vs KKR
చెన్నై సూపర్ కింగ్స్

By

Published : Sep 26, 2021, 3:04 PM IST

Updated : Sep 26, 2021, 3:18 PM IST

పాయింట్ల పట్టికలో దూసుకుపోతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరికాసేపట్లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో (CSK Vs KKR) తలపడనుంది. రెండో దశలో రెండు జట్లూ ముంబయి, బెంగళూరు జట్లను ఓడించి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. అయితే, మరికాసేపట్లో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే టాస్‌ గెలిచిన కోల్‌కతా (KKR Won The Toss) కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

కాగా, ఇరు జట్లూ (CSK Vs KKR 2021) అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో పటిష్టంగా ఉండటంతో మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే విషయంపై ఆసక్తి పెరిగింది. రెండు జట్ల కూర్పులోనూ (CSK Vs KKR Players List) పెద్దగా మార్పులు లేవు. సీఎస్​కేలో బ్రావో బదులు కరన్​ జట్టులోకి వచ్చాడు.

జట్లు:

చెన్నై సూపర్ కింగ్స్​: రుతురాజ్​ గైక్వాడ్​, డుప్లెసిస్​, మొయిన్​ అలీ, సురేశ్​ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మహేంద్రసింగ్​ ధోనీ(కెప్టెన్​, వికెట్​ కీపర్​), సామ్​ కరన్, హేజిల్​వుడ్​, శార్దూల్​ ఠాకూర్​, దీపక్​ చాహర్​.

కోల్​కతా నైట్​రైడర్స్​: శుభ్​మన్​ గిల్​, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రానా, ఇయాన్​ మోర్గాన్ (కెప్టెన్), దినేశ్ కార్తీక్(వికెట్​ కీపర్​), ఆండ్రూ రసెల్, సునీల్ నరేన్, ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిధ్ కృష్ణ.

ఇదీ చూడండి:IPL 2021: బెంగళూరు-ముంబయి.. గెలుపుబాట పట్టేదెవరు?

Last Updated : Sep 26, 2021, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details