రెండు దశల్లో జరిగిన ఐపీఎల్ 14 సీజన్ విజేతగా చెన్నై సూపర్‌కింగ్స్ నిలిచింది. ఈ విజయం వెనుక జట్టు (IPL 2021 records list) ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్‌ల పాత్ర అంతా ఇంతా కాదు. బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపించి సీఎస్కేకు తిరుగులేని విజయం అందించారు. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు. మరి ఆ రికార్డు(CSK VS KKR MATCH RECORDS) ఏంటంటే?
రుతురాజ్ మెరుపు షాట్లు..
ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌లో చెన్నై యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (ruturaj gaikwad ipl runs) మొదటి నుంచి జట్టుకు కీలక ఆటగాడిగా నిలిచాడు. మెరుపు షాట్స్‌తో సీఎస్కేకు (ruthuraj gaikwad records) విజయాలు అందించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్ధులకు చెమటలు పట్టించాడు. ఈసారి అత్యధిక పరుగుల వీరుడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ (IPL Awards 2021) సొంతం చేసుకున్నాడు. మొత్తంగా 16 మ్యాచ్‌ల్లో 635 పరుగులతో నిలిచాడు. ఐపీఎల్లో ఈ క్యాప్ సాధించిన (IPL Awards 2021) అత్యంత పిన్నవయుస్కుడిగా రుతురాజ్ ఘనత సాధించాడు. ఆరెంజ్ క్యాప్‌తో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా ఇతడికే దక్కింది.
600 కంటే ఎక్కువ పరుగులతో రికార్డు
రుతురాజ్‌తో పాటు దక్షిణాఫ్రికా బ్యాటర్ డుప్లెసిస్ (du plessis records) ఐపీఎల్ 2021 సీజన్‌లో అదరగొట్టాడు. ప్రస్తుత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానం (633)లో నిలిచాడు. ఐపీఎల్ ఫైనల్లోనూ ఈ జోడి సీఎస్కే ఏడేళ్ల రికార్డును బద్దలు కొట్టింది. ఎక్కువసార్లు ఆఫ్ సెంచరీ చేసిన ద్వయం నిలించింది. ఈ క్రమంలో 2013లో తమ జట్టుకు చెందిన హస్సీ-రైనా నెలకొల్పిన మార్కును అధిగమించారు.