తెలంగాణ

telangana

ETV Bharat / sports

జడేజా విధ్వంసం.. బెంగళూరు లక్ష్యం 192 - chennai super kings vs royal challengers bengalore innings break

బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్​లో చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో 191 పరుగులు చేసింది. డుప్లెసిస్​ మరోసారి అర్ధ సెంచరీతో మెరువగా.. చివరి ఓవర్లో జడేజా సిక్సర్ల వర్షం కురిపించాడు. బెంగళూరు బౌలర్లలో హర్షల్​ పటేల్​ 3, చాహల్​ ఒక వికెట్ తీసుకున్నారు.

csk vs rcb, innings break
రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు vs చెన్నై సూపర్​ కింగ్స్​, విరాట్ కోహ్లీ, ధోనీ

By

Published : Apr 25, 2021, 5:29 PM IST

వాంఖడే వేదికగా బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్​లో ధోనీ సేన నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్​మెన్లలో డుప్లెసిస్​, రుతురాజ్, రైనా మెరిశారు. చివరి ఓవర్లో జడేజా సిక్సర్ల వర్షం కురిపించాడు. కోహ్లీ బృందంలో హర్షల్ పటేల్ 3, చాహల్​ ఒక వికెట్ తీసుకున్నారు.

టాస్​ గెలిచి బ్యాటింగ్​కు దిగిన చెన్నైకి శుభారంభం దక్కింది. తొలి వికెట్​కు ఓపెనింగ్​ జోడీ 74 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. ఈ జంట ప్రమాదకరంగా మారుతున్న సమయంలో రుతురాజ్ (25 బంతుల్లో 33 పరుగులు)ను చాహల్​ పెవిలియన్ పంపాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రైనా.. డుప్లెసిస్​కు సహకరించాడు. ఈ క్రమంలోనే డుప్లెసిస్(41 బంతుల్లో 50 పరుగులు)​ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరినీ వరుస బంతుల్లో ఔట్​ చేసి చెన్నై స్కోరుకు బ్రేకులు వేశాడు హర్షల్​ పటేల్. తర్వాత బ్యాటింగ్​కు వచ్చిన రాయుడు ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. చివరి ఓవర్లో జడేజా(28 బంతుల్లో 62 పరుగులు) బ్యాట్​ ఝుళిపించడం వల్ల చెన్నై భారీ స్కోరు చేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details