కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌కు తాము సిద్ధంగా ఉన్నట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ చెప్పాడు. "మాకు మంచి ప్రాక్టీస్ సెషన్ లభించింది. మా జట్టు ఆటగాళ్లు కఠినంగా శిక్షణ పొందారు. బాగా సన్నద్ధమయ్యారు. తొలి మ్యాచ్‌ను విజయంతో ప్రారంభిస్తామని ఆశిస్తున్నాం" అని పేర్కొన్నాడు.
సన్‌రైజర్స్ సన్నద్ధం.. మ్యాచ్‌కు రెడీ: వార్నర్
కోల్‌కతా జట్టుతో మ్యాచ్‌కు తాము సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ స్పష్టం చేశాడు. గెలుపుతో ఈ సీజన్ ప్రారంభిస్తామని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
"సామాజిక మాధ్యమాల వేదికగా మా అభిమానులు మంచి మద్దతు ఇస్తున్నారు. ఈ సీజన్లోనూ వారి నుంచి 100 శాతం అదే మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాను. కొన్ని మ్యాచ్‌లను గెలిచి వారికి కావాల్సిన ఆనందాన్ని అందిస్తాం" అని హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ తెలిపాడు.
ప్రస్తుత ఐపీఎల్లో హైదరాబాద్ తరఫున ఆడేందుకు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జేసన్ రాయ్ చెన్నైకి చేరుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో లీగ్‌కు దూరమైన మిచెల్ మార్ష్ స్థానంలో ఇతడు బరిలోకి దిగనున్నాడు. గత కొన్ని సీజన్లుగా వార్నర్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్న సన్‌రైజర్స్‌లోకి రాయ్ చేరడం ఆ జట్టుకు మేలు చేసేదే అని చెప్పొచ్చు.
ఇదీ చదవండి:'వికెట్ కీపర్-కెప్టెన్‌గా ధోనీ ట్రెండ్ సెట్ చేశాడు'