రిషభ్ పంత్ సారథ్యంలో చెన్నైపై గెలిచిన దిల్లీ జట్టు.. అదే ఊపులో రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. రబాడా, ఇషాంత్ రాకతో మరింత బలంగా తయారైంది.
మరోవైపు తొలి పోరులో పంజాబ్‌పై భారీ లక్ష్యాన్ని దాదాపు ఛేదించినంత పనిచేసింది రాజస్థాన్. కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుత శతకంతో అదరగొట్టినప్పటికీ తమ జట్టును గెలిపించలేకపోయాడు. అయితే దీనిని దిల్లీతో మ్యాచ్‌లో పునరావృతం చేయకుండా విజయం సాధించాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గ ప్రణాళికలు రచిస్తున్నాడు. గాయంతో స్టోక్స్, సీజన్ మొత్తానికి దూరమవడం రాజస్థాన్‌కు పెద్ద ఎదురుదెబ్బే.